ఇప్పుడున్న పరిస్థితుల్లో పాన్ ఇండియా చిత్రాలపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సోలోగా రిలీజ్ అయితే తప్పా సేఫ్ కానీ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎఫెక్ట్ తోనే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఇలాంటి పరిస్థితినే మరో పాన్ ఇండియా చిత్రం కెజీఎఫ్ ఎదురుకుంటోంది. ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో యష్ హీరోగా నటించిన కెజీఎఫ్ సూపర్ హిట్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో అయితే ఏకంగా ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా కెజీఎఫ్ చాప్టర్ 2 ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.

యూనివెర్సల్ అప్పీల్ కోసం ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లను తీసుకున్నారు. సోలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో కెజీఎఫ్ సోలో రిలీజ్ ప్లానింగ్ కు చిక్కులు వచ్చి పడ్డాయి. ఏప్రిల్ 14న మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే గాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత అమీర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా విడుదల వాయిదా పడిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.
ఈ వార్తలకు చెక్ పెడుతూ ఎట్టి పరిస్థితులలో లాల్ సింగ్ చద్దాని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సో కెజీఎఫ్ 2 కలెక్షన్స్ కు బాలీవుడ్ లో అమీర్ నుంచి చిక్కులు ఎదురైనట్లేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అదే రోజున తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల కానుంది. బీస్ట్ విడుదలైతే సౌత్ ఇండియాలో కూడా కెజీఎఫ్ 2 కలెక్షన్స్ పై ప్రభావం పడనుంది. ఒకవేళ ఏప్రిల్ 14నే కెజీఎఫ్ ని విడుదల చేస్తే అమీర్ ఖాన్, విజయ్ చిత్రాలతో పాటు ఏప్రిల్ 28న రానున్న ఆర్ఆర్ఆర్ నుంచి గట్టి పోటీ ఎదురుకోక తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో కెజీఎఫ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని వాయిదా వేస్తుందనే అంటున్నారు. ఇంకా ప్రీ పోన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికి అది మ్యాటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *