చైల్డ్ ఆర్టిస్టుగా రాశి 1986లో కెరీర్ ను ఆరంభించారు. రావు గారిల్లు, ఆదిత్య 369, పలనాటి పౌరుషం లాంటి సూపర్ హిట్ సినిమాలతో బాల నటిగా మెప్పించిన ఆమె 1996లో హీరోయిన్ గా మారారు. పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ గా మారారు. కానీ లక్ బాగాలేక స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం ఆమెకు దక్కలేదు. శ్రీకాంత్, జగపతిబాబు, వడ్డే నవీన్ ల సినిమాలలో నటించే అవకాశం మాత్రమే ఆమెకు దక్కింది.పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినా ఆ సినిమా క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కింది. దాంతో ఆమె కెరీర్ టాలీవుడ్ లో త్వరగానే ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె సమరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ చేసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి అభిమానుల ఆరాధ్య హీరో బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోతుంది. ఫ్యాక్షనిజం సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఆ సినిమా 1999 సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ దుమ్ము రేపింది. బాలయ్య నటనా విశ్వరూపం కనబరిచిన ఈ సినిమా 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసిందంటే ఏ రేంజిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది.బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య పలికిన ప్రతి డైలాగ్ తూటాలా పేలాయి.ఈ చిత్రంలో సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరి నటించారు. అందాల ఆడబొమ్మ, చలిగా ఉందన్నాడే కిలాడీ బుల్లోడు, నందమూరి నాయక అందమైన నాయిక, రావయ్య ముద్దుల మామ లాంటి పాటలకు మణిశర్మ అందించిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.

ఈ సినిమాలో సిమ్రాన్ నటించిన పాత్రకు తొలుత రాశిని అనుకున్నారట. అయితే ఆ సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్ తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో, సిమ్రాన్ ని ఫైనల్ చేశారట. బొడ్డుపై సీతాకోక చిలుకని బాలయ్య తీసే సన్నివేశం ఉంటేనే సమరసింహారెడ్డి సినిమా అవకాశాన్ని రాశి వదులుకోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బాలయ్య జోడిగా నటించే అవకాశం మిస్ చేసుకున్న రాశి ఆ తరువాత సరైన అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయ్యారు. కానీ ఆ తరువాత వెంకీ, శీను సినిమాలలో హాట్ స్పెషల్ సాంగ్స్ చేసి ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఆ తరువాత నిజం సినిమాలో అయితే ఏకంగా అడల్ట్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అనే సామెత లాగా అందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకొని రాశి తప్పు చేసిందని సినీ పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *