రెబల్ స్టార్ నుంచీ నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ వరుసుగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ఇప్పటికే దాదాపుగా 60శాతం షూటింగ్ ని పూర్తి చేస్తుంది ఈ సినిమా. అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ మాస్ యాక్షన్ లుక్ లో వచ్చిన ప్రభాస్ పోస్టర్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇప్పటికే ప్యాన్ ఇండియా రేంజ్ లో బజ్ ని క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 రిలీజై ఉంటే సలార్ సినిమాకి ఇంకా బాగా క్రేజ్ వచ్చి ఉండేది. అయితే, ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 సలార్ కంటే ముందే రిలీజ్ అవుతుంది కనక, ఇది సలార్ సినిమా మార్కెట్ పెంచేందుకు ఇంకా ఎక్కువగా దోహదపడుతుంది.
అందుకే, ఈ సినిమాకోసం చాలా స్పెషల్ యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక యాక్షన్ సీన్ కోసం దాదాపుగా 20కోట్లకి పైగా ఖర్చు చేస్తున్నారని, అందరూ థ్రిల్ అయ్యేలా ఈ స్టంట్ ఉంటుందని టాక్. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో కలిసి ఈ యాక్షన్ సీక్వన్స్ ని ప్లాన్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. దీనికోసం ప్రభాస్ 10కేజులు వెయిట్ తగ్గేందుకు సిద్ధమయ్యాడట. అందుకోసం 30రోజులు కేటాయించబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ సలార్ సినిమాకోసం ఇన్ని రోజులు కేటాయించాడంటే సూపర్ అని చెప్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ ని తీస్కోబోతున్నట్లుగా కూడా చెప్తున్నారు. శ్రద్ధా కపూర్ సాహో సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. సలార్ లో యాక్షన్ సీన్స్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ కూడా హైలెట్ గా ఉండబోతున్నాయట. హీరోయిన్ శృతిహాసన్ తో వచ్చే సీన్స్ సెంటిమెంట్ గా ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఒక రేంజ్ లో చూపించబోతున్నాడు. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *