కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఆ అనుమానాలకు గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన మూడు చిత్రాలు చెక్ పెట్టాయి. డిసెంబర్ 2న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. ఈ సినిమా 46వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లను రాబట్టడం విశేషం. 54 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమా 46 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 73.34 కోట్ల షేర్ 129 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయడం విశేషం.

Nizam: 20.89Cr
Ceeded: 15.81Cr
UA: 6.32Cr
East: 4.22Cr
West: 4.25Cr
Guntur: 4.77Cr
Krishna: 3.66Cr
Nellore: 2.64Cr
AP-TG Total:- 62.56CRR(104CR~ Gross)
Ka+ROI: 5.07Cr
OS – 5.71Cr
Total WW: 73.34CR(129CR~ Gross)

ఇక డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఓటీటీలో విడుదలైనా ఈ సినిమా సందడి థియేటర్లలలో ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. ఉత్కంఠకు తెర దించుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి 31 రోజుల్లో 172.41 కోట్ల షేర్ 330 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.

Nizam: 40.65Cr
Ceeded: 15.08Cr
UA: 8.10Cr
East: 4.89Cr
West: 3.95Cr
Guntur: 5.13Cr
Krishna: 4.25Cr
Nellore: 3.08Cr
AP-TG Total:- 85.13CR(132.83CR~ Gross)
Karnataka: 11.59Cr
Tamilnadu: 11.38Cr
Kerala: 5.51Cr
Hindi: 42.10Cr(updated)
ROI: 2.22Cr
OS – 14.48Cr
Total WW: 172.41CR(330CR~ Gross)

గత ఏడాది చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. నాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమాకి ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకుడు. డిఫెరెంట్ కథను కథను సాధ్యమైనంత వరకు కమర్షియల్ గా కూడా వర్కవుటయ్యేలాగా దర్శకుడు తెరకెక్కించడంతో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

Nizam: 9.57Cr
Ceeded: 2.78Cr
UA: 2.25Cr
East: 1.16Cr
West: 86L
Guntur: 1.23Cr
Krishna: 1.08Cr
Nellore: 65L
AP-TG Total:- 19.59CR(33.32CR~ Gross)
Ka+ROI: 3.05Cr
OS – 3.73Cr
Total WW: 26.36CR(46.50CR~ Gross)

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి పంపిణీదారులకు మంచి లాభాలను తీసుకువచ్చింది. ఈ మూడు చిత్రాలు సూపర్ హిట్ విజయాలను అందుకోవడంతో టాలీవుడ్ లో సందడి వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *