యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ‘కార్తికేయ 2’ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ ద్వాపరయుగంతో ముడిపడిన ఒక రహస్యానికి సంబంధించి ద్వారకానగరం చుట్టూ తిరుగుతుంది. అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. సుబ్రమణ్యపురం అనే ఊళ్లో సుబ్రమణ్య స్వామి ఆలయం చుట్టూ కార్తికేయ సినిమా ఉండగా రెండవ పార్ట్ కోసం ద్వారక చుట్టూ దర్శకుడు కథను అల్లుకున్నారు.

ద్వాపరయుగం .. ద్వారకానగరం .. ఈ రెండింటితో ముడిపడిన ఒక రహస్యం. జనాలను థియేటర్లకు రప్పించడానికి ఈ లైన్ చాలు. ఎందుకంటే ద్వాపరయుగానికి సంబంధించిన అంశాలను, విశేషాలకు నిలయమైన ద్వారకానగరం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఆ ఆసక్తినే ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన బలం అనడంలో అతిశయోక్తి లేదు. ప్రేక్షకుల అంచనాలను మించి ఈ సినిమా ఉండటంతో మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమా కలెక్షన్స్ పెరగడం విశేషం. హిందీలో అయితే ఈ సినిమా మొదటి రోజు కేవలం 60 స్క్రీన్స్ లో విడుదల కాగా రెండవ రోజు థియేటర్ల సంఖ్య 300కు పెరగడం విశేషం.

తెలుగులో ఈ సినిమాకి పెద్దగా థియేటర్లు దొరకలేదు. కేవలం చాలా తక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదలయింది. సూపర్ హిట్ రావడంతో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. దాంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా 9 కోట్లకు పైగా షేర్ 12 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేయడం విశేషం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 13.30 కోట్లు వసూల్ చేయవలసి ఉంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 9 కోట్లకు పైగా వసూల్ చేయడంతో బ్రేక్ ఈవెన్ సాదించేందుకు ఇంకా కేవలం 4 కోట్లు మాత్రమే వసూల్ చేయవలసి ఉంది. ఈ సినిమా సాధించిన విజయంతో నిఖిల్ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద ఆగష్టు నెల తెలుగు చిత్ర పరిశ్రమకు జీవం పోసిందని చెప్పకతప్పదు. ఈ నెలలో విడుదలైన బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాలు మంచి విజయాలు అందుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *