మెరుపు

హాయ్ హలో వెల్ కమ్ టు జిఎన్ ఎన్ ఫిలిందాబా…
రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమాకి రామ్ చరణ్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని టాక్ కూడా వినిపించింది. అయితే, ప్రస్తుతం శంకర్ భారతీయుడు2 సినిమా షూటింగ్ తో బిజీ కావడంతో అతి త్వరలో చరణ్ గౌతమ్ కాంబో మూవీ షూట్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. గౌతమ్ సినిమాపై చరణ్ దృష్టి పెట్టారని ఈ సినిమాకి టైటిల్ కూడా మెరుపు అని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ , ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా
ఈ సినిమాను నిర్మించనున్నారు. కొత్త తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. గతంలో రామ్ చరణ్ ఫుట్ బాల్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని అనుకుని మద్యలోనే ఆ ప్రాజెక్ట్ ని ఆపేశారు. ఇప్పుడు మరోసారి ఫుడ్ బాల్ ప్లేయర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడని అంటున్నారు. నేషనల్ ఫుడ్ బాల్ ఛాంపియన్ షిప్ కోసం జరిగే కథగా ఈసినిమా తెరకెక్కబోతోందని అంటున్నారు. అయితే, ఇప్పటి వరకూ అఫీషియల్ గా ఎక్కడా కూడా గౌతమ్ సినిమా కథ కానీ, జోనర్ గానీ రివీల్ చేయలేదు.
ఇక మరోవైపు ట్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ రేంజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమా సక్సెస్ వల్ల రామ్ చరణ్ పారితోషికం కూడా అంచనాలకు మించి ఉంది. చరణ్ ఒక్కో ప్రాజెక్ట్ కు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా పాన్ ఇండియా రికార్డులను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఫుడ్ బాల్ నేపథ్యంలో కథ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్యాన్ ఇండియాకి బాగా కనెక్ట్ అవుతుందని, అన్ని భాషల్లో కూాడ సినిమాని రిలీజ్ చేయచ్చని భావిస్తున్నారట. అయితే, ఈసినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా నటించే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ 15వ సినిమా కంటే కూడా 16వ సినిమాపైనే ఫ్యాన్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *