ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి కన్నడ భామ కృతి శెట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా పుష్కలంగా ఉండటంతో కృతి శెట్టి వరుసగా ఆఫర్లు అందుకుంది. తొలి చిత్రం ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న కృతి ఆ తరువాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. దాంతో కెరియర్ పరంగా ఈ మధ్య కాలంలో ఇంతలా దూసుకుపోయినవారెవరూ లేరంటూ ఫిలిం వర్గాలలో చర్చ కూడా జరిగింది. హ్యాట్రిక్ హిట్ పడేలోగానే కృతి శెట్టి మరో మూడు ఆఫర్స్ లకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.

ఆ మూడు సినిమాల్లో ఒక సినిమా ‘ది వారియర్’ గత నెలలో థియేటర్లకు వచ్చింది. యంగ్ హీరో రామ్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా మొదటి ఆట నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకొని డిస్జాస్టర్ గా నిలిచింది. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆమెకి ఫస్టు ఫ్లాప్ ఇచ్చింది. ఇక ఆమె నితిన్ జోడీగా చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. పాత్ర పరంగా కృతికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, కథాకథనాలు రోటీన్ గా ఉండటం వలన ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ రెండు సినిమాలలో నటన పరంగా కృతి పెద్దగా ఆకట్టుకోలేక పోయారంటూ విమర్శకులు అభిప్రాయపడ్డారు. దాంతో కృతి శెట్టి కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్లే కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ పైనే ఉన్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని వచ్చే నెల 16న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాపైనే కృతి శెట్టి ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే మాత్రం కృతి శెట్టికి గడ్డు కాలం తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *