అల్లు అర్జున్-సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 176 కోట్ల షేర్ 338 కోట్ల గ్రాస్ వసూల్ చేసి నయా రికార్డు నెలకొల్పింది. ఓవర్సీస్ లో దాదాపు 4 మిలియన్స్ వసూల్ చేసిన ఈ సినిమా హిందీలో అయితే ఏకంగా 87 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో అయితే ఈ సినిమా ఏకంగా రికార్డు వసూల్ చేసి నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పింది. వరల్డ్ వైడ్ గా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ దశకు చేరుకుంది. ఈ సినిమా ఫైనల్ గా 110.08 కోట్ల షేర్, 185 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు 123.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా మన రాష్ట్రాలలో సేఫ్ కావాలంటే 124.50 కోట్లు వసూల్ చేయవలసి ఉంది. కానీ ఈ సినిమా ఫైనల్ రన్ 110 కోట్ల వద్ద మాత్రమే ఆగిపోయింది. ఈ సినిమా హక్కులను కొన్న పంపిణీదారులకు ఈ సినిమా 14.42Cr నష్టాన్ని మిగిల్చింది. ఓవరాల్ గా 88 శాతం రికవరీ చేసిన ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాలలో ఎబోవ్ ఎవరేజ్ గా నిలిచింది. ఏపీలో టికెట్ ధరల తగ్గింపు, ఓమిక్రాన్ ఎఫెక్ట్, ఓటీటీలలో విడుదల కావడం ఇలాంటి కారణాల చేత ఈ సినిమాకు ఏపీ & తెలంగాణ రాష్ట్రాలలో 14 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. వరల్డ్ వైడ్ గా భారీ లాభాలను తెచ్చిన ఈ సినిమా బన్నీ సొంత రాష్ట్రంలో నష్టాన్ని తీసుకురావడంపై బిజినెస్ వర్గాలు షాక్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ విషయానికి వస్తే..,

Nizamలో 36 కోట్ల బిజినెస్ జరగగా ఈ సినిమా జీఎస్టీ మినహాయిస్తే ఫైనల్ గా 39.72 కోట్లు వసూల్ చేసింది. Ceededలో 18Crబిజినెస్ జరగగా ఫైనల్ గా 15.17 కోట్లు, వైజాగ్ లో 12.25 కోట్ల బిజినెస్ కు ఫైనల్ రన్ లో 8.13 కోట్లు వసూల్ చేసింది. తెలంగాణలో మంచి లాభాలు తెచ్చిన ఈ సినిమా ఏపీలో మాత్రం నష్టాలను తీసుకువచ్చింది.

Nizam: 39.72Cr(36.45Cr Without GST)(inc All – 40.74CR)
Ceeded: 15.17Cr
UA: 8.13Cr
East: 4.89Cr
West: 3.95Cr
Guntur: 5.13Cr
Krishna: 4.26Cr
Nellore: 3.08Cr
AP-TG Total:- 84.33CR(131.50CR~ Gross)
Karnataka: 9.85Cr
ROI: 2.45Cr
OS – 13.45Cr
Total WW: 110.08CR(185CR~ Gross)

కానీ ఓవరాల్ గా ఈ సినిమా 330 కోట్ల గ్రాస్ వసూల్ చేసి పైసా వసూల్ సినిమాగా నిలిచింది. హీరో క్యారెక్టరైజేషన్ సూపర్ గా ఉండటంతో ఈ సినిమాను వేరే భాష ప్రేక్షకులు ఔన్ చేసుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *