యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ట్రిబుల్ ఆర్ తో ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్ లో మారుమోగిపోతోంది. నిజానికి చిన్న వయసులోనే వచ్చిన స్టార్ట డమ్ ని కరెక్ట్ గా ఉపయోగించుకున్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే, అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి సెన్సేషనల్ సృష్టించాడు. అనర్గళంగా స్పీచ్ లు ఇస్తూ తమ పార్టీకి తిరుగులేదని చెప్పుకొచ్చాడు. అదే ఊపులో ఉండగా ఎవరో బ్రేక్ వేసినట్లుగా యాక్సిడెంట్ అవ్వడం, ఆ తర్వాత నుంచీ పెద్దగా పార్టీవైపు చూడకపోవడం, సినిమాలపైనే ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే, రీసంట్ గా అసెంబ్లీలో జరిగిన ఇష్యూపై తారక్ స్పందించాడు. నిజానికి నిన్న మొన్నటిదాకా రాజకీయాల్లోకి అస్సలు ఇష్టం లేదనే చెప్పుకుంటూ వచ్చాడు తారక్. కానీ, తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో మాత్రం రామయ్య వస్తాడని, ఏదైనా చేస్తాడనే ఆశ మాత్రం మిలిగే ఉంది.
నిజానికి తారక్ అభిమానులు ఎక్కువమంది రాజకీయాలలో యాక్టివ్ గా ఉండాలనే కోరుకుంటున్నారు. దేశ విదేశాల్లో ఫ్యాన్స్ సైతం అలాగే ఆలోచిస్తూ పోస్ట్ లు కూడా చేస్తున్నారు. ఇక రీసంట్ గా చెన్నైలో జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేల సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. అంతేకాదు, అక్కడ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ జెండాలు కూడా పట్టుకోవడం విశేషంగా మారింది.
ఎన్టీఆర్ సినిమా ఈవెంట్లలో టీడీపీ జెండాల ద్వారా తారక్ రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్లలో ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ తారక్ రాజకీయాల్లోకి రావాలని నినాదాలు కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ సిఎం సిఎం అంటూ కూడా గోల గోల చేస్తున్నారు. నిజానికి అభిమానుల మాటలని తారక్ పట్టించుకుంటాడో లేదో కానీ, రామయ్య రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీకి మళ్లీ ఆ వైభవం రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఏపీలో ప్రసుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. 2024 ఎలక్షన్స్ కి ఏదో ఒకటి అయితేనే కానీ, పుంజుకవడం కష్టమే. ఇక చంద్రబాబు పిలిస్తే జూనియర్ ఎన్టీఆర్ తప్పుకుండా పార్టీలోకి వస్తాడని పార్టీ పగ్గాలు చేపడతాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలపైనే దృష్టిసారిస్తున్నాడు. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *