మెగా పవర్ స్టార్ 100కోట్ల రెమ్యూనిరేషన్ తో దూసుకుపోతున్నాడా అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక్కో సినిమా చేయాలంటే రెండు మూడు సంవత్సారుల ఈజీగా పట్టేస్తోంది. అందులోనూ ఇప్పుడున్న యంగ్ హీరోలో సంవత్సరానికి ఒక్కసినిమా చేసేవాళ్లే. ఇక పెద్ద డైరెక్టర్ కి డేట్స్ ఇచ్చారు అంటే ఈ సినిమా ఖచ్చితంగా రెండూ మూడు సంవత్సారాల టైమ్ పట్టేస్తోంది. అందులోనూ పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలు అయితే, ఇంకా టైమ్ తీస్కుంటున్నారు. దీని బడ్జెట్ కూడా చాలా ఎక్కువే. అందుకే హీరోలు సైతం తమ రెమ్యూనిరేషన్స్ ని పంచేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పుడు 100కోట్లకి చేరాడా అనేది హాట్ టాపిక్ అయ్యింది.
ఇదే విషయాన్ని రామ్ చరణ్ ని అడిగితే, అవన్నీ అసత్యాలుగా కొట్టిపారేశాడు. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? ఉన్నా నాకెవరు ఇస్తారు? అని తిరిగి ప్రశ్నిస్తూ అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చేశాడు.
నిజానికి 2019లో వినయ విధేయ రామతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ టేకప్ చేశాడు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ లో మెగాస్టార్ తో కలిసి ఆచార్యకి శ్రీకారం చుట్టాడు. ఇందులో కూడా కీలకమైన రోల్ లో రామ్ చరణ్ కనిపించాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు హ్యూజ్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాయి. అందుకే, రామ్ చరణ్ శంకర్ సినిమాకి వందకోట్లు తీస్కుంటున్నాడని పుకార్లు ఊపందుకున్నాయి. కానీ, రామ్ చరణ్ ఇవన్నీ సృష్టించినవే అని చెప్పేసరికి ఈవార్త గాలివార్త అని తేలిపోయింది.
ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న తెలుగు హీరోలు మాత్రం పాన్ ఇండియన్ రేంజ్ కి ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో వరుసు సినిమాలూ చేస్తూ వీళ్లందిరకీ ఇన్సిపిరేషన్ గా నిలుస్తున్నాడు. అందుకే, ఇప్పుడు పోటీగా ప్రతి హీరో కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో సబ్జెక్ట్స్ పైనే మొగ్గు చూపుతున్నారు. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *