బాలీవుడ్ లో అక్షయ్‌ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌ కలిసి చేసిన సినిమా ‘ఆత్రంగి రే’. ఈ సినిమాకి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు, ట్రెండింగ్ లోకి కూడా వచ్చేసింది. ఇందులో ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ హిందీ షోలో పాల్గొన్న ధనుష్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన మనసులో మాటలని పంచుకున్నాడు. నిజానికి ఒకవైపు తమిళ సినిమాలు చేస్తూనే తెలుగు కూడా హీరోగా రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెలుగులో అరంగేట్రం చేయబోతున్నాడు. నిజానికి ఇప్పటివరకూ ధనుష్ డబ్బింగ్ సినిమాలే చూసిన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు స్ట్రయిట్ సినిమా చేయబోతున్నారు.

అయితే, ప్యాన్ ఇండియా రేంజ్ లో సెలబ్రిటీలు అయిన వారి బయోపిక్స్ కి హాట్ డిమాండ్ ఉంది.
‘బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తోన్న ఈ సమయంలో మీరు ఎవరు బయోపిక్స్‌లో నటిస్తారు?’ అనే ప్రశ్నకు ధనుష్‌ బదులిస్తూ– ‘‘రజనీకాంత్, ఇళయరాజగార్లంటే ఎంతో ఇష్టం.. ఎనలేని అభిమానం. అవకాశం వస్తే వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని ఉంది’’ అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, ఇళయరాజా గెటప్ వేసినా, రజనీకాంత్ గెటప్ లో వచ్చినా సిల్వర్ స్క్రీన్ పై ధనుష్ సరిగ్గా సరిపోతాడని, ఆ పర్సనాలిటీ కూడా మ్యాచ్ అయిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాల బయోపిక్స్ ఎవరు తీస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక్క తమిళంలోనే ఏకంగా ఏడు సినిమాలకి కమిట్ అయ్యాడు. అంతేకాదు, తెలుగులో కూడా రెండు సినిమాల్లో రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల్ డైరక్షన్ లో ఒక సినిమా, అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి కి మరో సినిమా కమిట్ అయ్యాడు. దీంతో తొమ్మిది సినిమాలని మ్యానేజ్ చేస్తున్నాడు మనోడు. అంతేకాదు, మరో రెండు వెబ్ సీరిస్ లకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, బాలీవుడ్ లో కూడా మరో సినిమా చేయబోతున్నాడని టాక్. మొత్తానికి అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *