ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా సొంతం చేసుకున్నారు. దాంతో ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ కానుంది. ఒకవైపు పుష్ప-2 కోసం రెడీ అవుతున్న బన్నీ మరోవైపు ప్రముఖ సంస్థలకు బ్రాండింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఓ ప్రముఖ మాదక ద్రవ్యాల సంస్థ 10 కోట్లు ఇస్తానన్నా ఆ భారీ ఆఫర్ కి బన్నీ నో చెప్పిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆన్ స్క్రీన్ పై మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ పై కూడా బన్నీ హీరోనే అంటూ ఫిలిం వర్గాలలో చర్చ జరిగింది.
10 కోట్ల ఆఫర్ కు బన్నీ నో చెప్పడం బాలీవుడ్ వర్గాలను కూడా షాక్ కు గురి చేశాయి. సోషల్ కాజ్ కోసం బన్నీ ఈ యాడ్ చేయకపోవడంపై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల జల్లులు కురిపించారు. ఇక అభిమానులు అయితే ఏకంగా #bunnythegreat అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాని హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ బన్నీ చూపిన ఈ చొరవపై పొగడ్తలు కురిపించారు. ఛత్తీస్ ఘర్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరన్… అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.గుట్కా, లిక్కర్ యాడ్స్ చేయమని వచ్చిన 10 కోట్ల ఆఫర్ ని ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వదిలేసుకోవడం గొప్ప విషయం అని అందుకే తనని అభినందిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.
దీంతో అవనీష్ శరన్ చేసిన ట్వీట్ సామాజిక మాంద్యమాలలో వైరల్ అయింది . ఇంకేముంది మరోమారు బన్నీ అభిమానులు #bunnythegreat అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ కాజ్ కోసం మాత్రమే కాదు బన్నీ నటన, డాన్స్ ఈజ్, మేనరిజానికి చాలా మంది అభిమానులుగా మారుతున్నారు. లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే కూడా బన్నీపై తన ఇష్టాన్ని తెలియచేశారు. ‘మీకు ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరు?’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ, తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమనీ .. ఆయన డాన్స్ తనని ఆశ్చర్యపరుస్తూ ఉంటుందని చెప్పింది. అల్లు అర్జున్ చేసిన సినిమాల్లో ‘అల వైకుంఠపురములో’ చూశాననీ, ఆయన యాక్టింగ్ కి కూడా తాను ఫిదా అయ్యానని అంది. మొత్తానికి బన్నీ చేసిన తొలి చిత్రంతోనే ఓ రేంజ్ ఇమేజ్ చేసుకోవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.