నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకోవాలని ప్లాన్ చేశారు. అయితే వరుస సినిమాలతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే ప్రచారం జరిగింది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, ప్రభాస్ మిస్టర్ కే సినిమాల షూటింగ్స్ కు సమయం కేటాయించడంతో ఈ సినిమా షెడ్యూల్స్ లో మార్పులు జరిగాయి.

సలార్ షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ డేట్స్ సెట్ అయ్యాయి. దాంతో ఈ సినిమాని చేసేందుకు ఆయన ఓకే చెప్పాడు. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను మేకర్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి ట్యాగ్ చేయడంతో, ఆయన ఈ సినిమా చేయడం ఖరారైపోయింది. ఈ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అయితే లేటెస్ట్ గా ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో పృథ్వీరాజ్ విలన్ గా నటించడం లేదట. ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేయనున్నాడని తెలిసింది. ప్రభాస్ ను ముప్పు తిప్పలు పెట్టే పాత్రలో ఆయన పాత్ర ఉండనుందట.

ఈ సినిమా కోసం ఆయన 10 కోట్లకు పైగా రెమ్యునిరేషన్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఆయనకు మలయాళంతో బాటు హిందీలో కూడా మంచి పాపులారిటీ ఉంది. ఈ క్రేజ్ ను ద్రుష్టిలో పెట్టుకొనే పృథ్వీరాజ్ కు భారీ రెమ్యునిరేషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని అందుకోకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రీయ రెడ్డి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. హీరో విశాల్ అన్నయ్యను వివాహం చేసుకున్న శ్రీయ చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ‘కేజీఎఫ్’ను తెరకెక్కించిన హొంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *