సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు వచ్చేనెల నుంచి మొదలుకానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ఓ టీజర్ ను విడుదల చేశారు. ‘అతడు’ .. ‘ఖలేజా’ తరువాత మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇది. చాలా గ్యాప్ తరువాత ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఏ జానర్ లో ఉండనుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం పీరియాడికల్ జానర్ లో ఉండనుందని వార్తలు జోరుగా ప్రచారం జరిగాయి. కానీ ప్రస్తుతం ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ మూవీగా ఉండనుంది. ఈ జానర్ ను త్రివిక్రమ్ ఇప్పటివరకు టచ్ చేయలేదు. త్రివిక్రమ్ ఇప్పటివరకు తీసిన సినిమాలలో లవ్, ఫ్యామిలీ. కామెడీ, యూత్ ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే ఈసారి మహేశ్ తో ఆయన చేయనున్న సినిమా యాక్షన్ జోనర్ లో ఉంటుందని అంటున్నారు.

మహేష్ బాబు నుంచి మాస్ యాక్షన్ మూవీ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు దాటింది. అందువలన ఈ జోనర్లో త్రివిక్రమ్ చెప్పిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ రవిచంద్రన్ ఓ కీలకపాత్రలో నటించనున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ పేరు వినిపిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా పూర్తి కావడం ఆలస్యం రాజమౌళితో మహేష్ తన 29వ చిత్రాన్ని చేయనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *