సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 50 కోట్ల రెమ్యునిరేషన్ అందుకోనున్నాడని టాక్ నడుస్తోంది. తొలిసారి మహేష్ ఈ మూవీలో డబుల్ యాక్షన్ చేస్తారని ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో మరో మహేష్ బాబు కనిపిస్తారంటూ ప్రచారం జరిగింది.
కానీ ఆ వార్తలకు చెక్ పెడుతూ ఈ చిత్రంలో మహేష్ డ్యూయల్ రోల్ చేయడం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటించి ఎన్నో నెలలు అవుతున్నా షూటింగ్ మాత్రం స్టార్ట్ కావడం లేదు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనులలో బిజీగా ఉన్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కీలకమైన పాత్ర కోసం మరో హీరోను త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. తొట్టెంపూడి వేణుకి త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ దొరికినట్టుగా తెలుస్తోంది. హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వేణు సహాయ నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు. ‘దమ్ము’ సినిమా తరువాత మాత్రం ఆయన తెరపై కనిపించలేదు. దాదాపు 10 సంవత్సరాల తరువాత ఆయన రీ ఎంట్రీ మూవీగా రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీ ఎంట్రీలో ఆయన చేసిన రామారావు సినిమా వేణుకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న వేణుకు త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు. త్రివిక్రమ్ – వేణు ఇద్దరూ కూడా ‘స్వయంవరం’ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమాకి త్రివిక్రమ్ కథ – సంభాషణలు అందించాడు. ఆ తరువాత వీరి కాంబోలో చిరునవ్వుతో సినిమా వచ్చింది. రీ ఎంట్రీ ఇచ్చిన వేణుకి హిట్ ఇచ్చే బాధ్యతను తీసుకున్న త్రివిక్రమ్ ఆయనకు ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. మూడవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. శరవేగంగా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *