నాచురల్ స్టార్ నాని పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నాని నటిస్తున్న దసరా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇక్కడే భారీ బొగ్గు గని సెట్ వేశారు. అయితే, ఓ బొగ్గు లారీ కింద నాని నటించే సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, బొగ్గు లోడు మొత్తం ఒక్కసారి నానిపై పడింది. దాంతో సెట్స్ పై ఉన్న అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నాని ఆ బొగ్గులోంచి క్షేమంగా బయటికి రావడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ ను కాసేపు నిలిపివేశారు.

గాయాలేమీ కాకపోయినప్పటికీ, నాని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత నాని మళ్లీ షూటింగ్ కు సిద్ధం కావడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ప్రమాదం నుంచి క్షేమంగా తప్పించుకున్న నానికి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నుంచి భారీ ప్రమాదమే పొంచి ఉంది.

సినిమా హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా నాని తన పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారట. నాని నటించిన గత చిత్రాలు ఏవీ బ్రేక్ ఈవెన్ సాదించని సంగతి తెలిసిందే. కానీ నాని సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకుంటూ వెళ్తుంటారట. సినిమా ప్లాప్ అయినా బ్రేక్ ఈవెన్ కాకపోయినా నిర్మాత‌ల‌కు పారితోషికాల్లో రిబేటు ఇవ్వ‌రట. అలాంట‌ప్పుడు నాని చుట్టూ ఎందుకు తిర‌గాలి? నానితో సినిమాలు ఎందుకు చేయాలి? అని కొంత‌మంది నిర్మాత‌లు మా మీటింగ్ లో గ‌ట్టిగా వాదించిన‌ట్టు స‌మాచారం. నానితో సినిమాలు తీయకుండా పక్కన పెట్టాలని అప్పుడు గానీ దారిలోకి రార‌ని కొంత‌మంది నిర్మాత‌లు మాతో చెప్పినట్లు తెలిసింది. బయట జరుగుతున్న ప్రచారం మేరకే ప్రస్తుతం నాని చేతిలో దసరా సినిమా తప్పా వేరే సినిమాలు లేవు. మరి ఈ ప్రమాదం నుంచి నాని ఎలా బయటపడతాడో చూడాలి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *