నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ ఈ నెల 5న థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ఆయన కొత్త దర్శకుడు వశిష్టతో చేశాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడంతో ఈ సినిమాను. ఒక కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయగలడా? అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 16 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. నాలుగో రోజు కూడా ఈ సినిమా థియేటర్ల వద్ద సందడి చేయడం విశేషం.

Nizam: 5.92Cr
Ceeded: 3.60Cr
UA: 2.30Cr
East: 1.05Cr
West: 76L
Guntur: 1.29Cr
Krishna: 90L
Nellore: 52L
AP-TG Total:- 16.54CR
Ka+ROI: 1.12Cr
OS – 1.35Cr
Total World Wide: 19.29CR

16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా నాలుగు రోజులకే 3 కోట్లకు పైగా లాభాలు తీసుకురావడం విశేషం. అతి త్వరలోనే ఈ సినిమా 25 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *