కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన బింబిసార సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది ఈ సినిమా. నిజానికి కళ్యాణ్ రామ్ కెరియర్ లో పటాస్ సినిమా మాత్రమే హైఎస్ట్ కలక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు ఈ మూవీ మాత్రం తొలిరోజే 12కోట్లకి పైగా షేర్ ని సాధించి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఫుల్ రన్ లో బింబిసార సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ ఖాతాలో ఈ అరుదైన రికార్డ్ చేరాలని నందమూరి అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే కళ్యాణ్ రామ్ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ మార్కును అందుకోవడం కష్టం కాదంటూ లెక్కలు వేస్తున్నారు. ఇక బింబిసార సినిమాని థియేటర్స్ లో మాత్రమే చూడాలని ప్రచారం కూడా చేస్తున్నారు అభిమానులు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన విధంగా కళ్యాణ్ రామ్ తప్ప ఎవరూ నటించలేరన్నంత అద్భుతంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించడం అనేది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి బింబిసార 2పై పడింది. బింబిసార 2లో కళ్యాణ్ రామ్ తో పాటుగా, జూనియర్ ఎన్టీఆర్ సైతం నటించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతితెలిసిందే. దీంతో అంచనాలు అనేవి పెరిగిపోతున్నాయి. బింబిసార2 ఖర్చు విషయంలో కూడా రాజీ పడనని కళ్యాణ్ రామ్ ఇంటర్య్వస్ లో చెప్పడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బింబిసార క్లోజింగ్ కలక్షన్స్ ని బట్టీ చూస్తే, బింబిసార 2కి మార్కెట్ రెడీ అయిపోతుంది. దానిని బట్టీ బడ్జెట్ ప్లాన్ తో పక్కా స్క్రిప్ట్ తో వర్క్ స్టార్ట్ అవుతుందని టాక్.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా 50కోట్ల మార్కెట్ ని సాధిస్తే మాత్రం రికార్డ్ క్రియేట్ చేసినట్లే అవుతుంది. మరి కళ్యాణ్ రామ్ ఆ రికార్డ్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *