నేషనల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా పౌరాణిక జానర్ లో చేస్తున్న చిత్రం’ఆది పురుష్’. ఈ జనరేషన్ లో ఇంతటి భారీ అవకాశం ఆయనకి రావడం నిజంగా విశేషమే. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రామాయణం నేపథ్యంలో ఇంతవరకూ వచ్చిన సినిమాలకి మించి కొత్తగా ఉండనుందని అంటున్నారు. సీతారాములుగా కృతి సనన్ – ప్రభాస్ నటించగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవదత్త .. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రాఘవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడని చెబుతున్నారు.

ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వీఎఫ్ ఎక్స్ వర్క్ ను జరుపుకుంటోంది. హాలీవుడ్ మూవీ ‘అవతార్’ కోసం ఉపయోగించిన టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారట. దేశ విదేశాలకి చెందిన 50 మంది సాంకేతిక నిపుణుల టీమ్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఒక్క క్లైమాక్స్ కోసమే 60 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకు ఓటీటీ బిజినెస్ పూర్తి కావడం విశేషం. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తంలో చెల్లించి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

అన్నీ భాషల హక్కులను కలుపుకొని ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ 250 కోట్లకు పైగా చెల్లించినట్లు చెబుతున్నారు. డిజిటల్ హక్కుల రూపంలోనే సగానికి పైగా బడ్జెట్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. శాటిలైట్, థియేట్రికల్ హక్కులు, ఓవర్సీస్ హక్కులను కలుపుకుంటే ఈ సినిమాకి బిజినెస్ 700 కోట్లకు పైగా దాటిపోయేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రమోషన్స్ కు మూడు నెలల సమయాన్ని కేటాయించిన చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? రాదా? అని ప్రభాస్ అభిమానులు టెన్షన్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *