‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు మూడు సంవత్సరాలకు పైగా సమయాన్ని కేటాయించాడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అన్నీ అనుకున్నట్టు సాగితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాగానే ఎన్టీఆర్ తన తరువాతి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. స్టూడెంట్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఆ చిత్రంలో కథానాయికలుగా కియారా అద్వాని .. జాన్వీ కపూర్ .. అలియా భట్ పేర్లు వినిపించాయి. డేట్స్, రెమ్యునిరేషన్ సమస్యలతో బాలీవుడ్ హీరోయిన్స్ ను కొరటాల పక్కన పెట్టేసాడట. తాజాగా
తెరపైకి రష్మిక మందాన పేరు వచ్చింది. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఈ భామ ఎన్టీఆర్ కు జతగా నటిస్తున్నారని వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.

రష్మిక హవా ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ నటిస్తుంది. లేటెస్ట్ గా ఆమె ‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించింది. ఆయా భాషల్లో రష్మిక కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అయింది. పుష్ప సినిమా ప్రభావంతో ఆమె కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ సరసన నటించే అవకాశం పట్టేసింది. ఇక తెలుగులో ఆమె శర్వానంద్ కు జోడిగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాయిక ప్రధానమైన సినిమా కూడా ఒకటి చేయనుంది. ఆ చిత్రంలో పాత్రను సమంత రిఫర్ చేయడం విశేషం. ఇక బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఆ చిత్రం తరువాత విక్కీ కౌశల్ సినిమాలోనూ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలతో పాటు ఆమె పుష్ప పార్ట్ 2 సినిమాని పూర్తి చేయనున్నారు. రష్మిక హవాతో పూజ హెగ్డే జోరు తగ్గిందని ఫిలిం వర్గాలలో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్టు కోసం మే నెలలో రష్మిక డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మే నెలలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు అభిమానులు ఫిక్స్ అయ్యారు. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని వేగంగా పూర్తి చేసి దీపావళికి విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి రెండు సినిమాలు వస్తుండటం ఆయన అభిమానులలో జోష్ నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *