తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు, ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజమౌళి చేసిన ట్రిబుల్ ఆర్ , అలాగే సుకుమార్ అండ్ బన్నీల పుష్ప సినిమాలని చెప్పచ్చు. ఈ కాంబినేషన్స్ వల్లే ముందుస్తుగానే డిజటల్ లో కానీ, లేదా బిజినెస్ పరంగా కానీ మంచి డిమాండ్ పెరిగిపోతుంది. హైఎస్ట్ పేమెంట్స్ అనేవి వర్కౌట్ అయిపోతాయి. అందుకే, హీరో – హీరోయిన్ స్టార్ కాస్టింగ్, ప్రొడక్షన్స్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాలని తీస్తుంటారు. ఇక ఇప్పుడు ఇలాగే మరో క్రేజీ కాంబినేషన్ కి డిజిటల్ లో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. దిల్ రాజ్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో దాదాపుగా 200 కోట్ల బిజినెస్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అసలు ఇంత బిజినెస్ అవుతుందా అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరుస్తోంది. జీ ఛానెల్ ఓటీటీ కోసం, శాటిలైట్ కోసం, మిగతా స్ట్రీమింగ్స్ కోసం ఈ ఎమౌంట్ ని సినిమాకి ముందుగానే పే చేస్తూ ఒప్పందం చేస్కున్నారని టాక్.
కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హెవీ స్టార్ కాస్టింగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. సునీల్, అంజలీ, శ్రీకాంత్, నవీన్ చంద్ర, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచీ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం రెండు పెద్ద పెద్ద భారీ సెట్స్ ని కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ సినిమా థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *