సంక్రాంతి పండగలాంటి సినిమా కాబట్టి, పండక్కే రిలీజ్ చేయాలని పట్టు బట్టి మరీ బంగార్రాజు సినిమా రిలీజ్ అయ్యింది. మరి ఈ బంగార్రాజు హిట్ కొట్టాడా.. లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే..
అసలు ఈ బంగార్రాజు సినిమా కథేంటి :
సోగ్గాడే చిన్నినాయానా ఎక్కడైతే ఫినిష్ అయ్యిందో అక్కడ్నుంచీ కథ అనేది స్టార్ట్ అవుతుంది. రమ్యకృష్ణ కోసం లోకకల్యాణం కోసం మరోసారి భూమ్మీదకి వచ్చిన బంగార్రాజు తన మనవడు చిన బంగార్రాజు కోసం ఏం చేశాడు అనేది సినిమా.
సినిమాలో ప్లాస్ పాయింట్స్ ఏంటంటే.,
సంక్రాంతి పండగలాంటి సినిమా. ఎటు చూసినా చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే, ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సినిమా హంగులన్నీ జోడించాడు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ. అదే సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక నాగార్జునకి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండిలాగా మారిపోయాయి. సరదా సంభాషనలతో చిలిపి చేష్టలు చేస్తూ బంగార్రాజు అందర్నీ ఆకట్టుకుంటాడు. కృతిశెట్టి కాస్త చిన్న పిల్లలాగా అనిపిస్తున్నా, క్యారెక్టర్ పరంగా పాసైపోయింది. చిన బంగార్రాజుగా చైతూ తన మెచ్యూరిటీ యాక్టింగ్ ని మరోసారి చూపించాడు. ఇలా ప్రతి పాత్రలకి అందరూ న్యాయం చేశారు. అదే సినిమాని నిలబెట్టింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు, హీరోకి హీరోయిన్ కి వచ్చే సరదా సన్నివేశాలు సినిమాకి ప్లస్ అయ్యాయి. పాటలు, కలర్ ఫుల్ ఫోటో గ్రఫీ సినిమాకి బలంగా మారింది. ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్ , డైరెక్షన్ స్కిల్స్, సీక్వల్ కథనం సినిమాకి ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి.
మైనస్ పాయింట్స్ ఏంటంటే..,
సన్నివేశాలు చూస్తున్న ప్రేక్షకుడు ముందుగానే వాటిని ఊహించేస్తాడు దాంతో పెద్దగా థ్రిల్ అని అనిపించదు. రొటీన్ స్టోరీ లైన్ నే కమర్షియల్ హంగులు అద్ది ఫెస్టివల్ ఫ్లేవర్ జోడించినట్లుగా ఉంటుంది. అంతేకాదు, కామెడీ సీన్స్ అస్సలు పేలలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ బోర్ కొట్టించేస్తాయి. స్లో నారేషన్ కూడా సినిమాకి మైనస్ అయ్యింది. కథలో కొత్తదనం లేకపోవడం అనేది సినిమాకి కొద్దిగా మైనస్. ఫస్ట్ పార్ట్ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది.
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే సోగ్గాడే చిన్నినాయనా అంత సూపర్ గా లేకపోయినా ఈ బంగార్రాజు పండక్కి పాసైపోతాడు నో డౌట్. థియేటర్స్ లో పండగ వాతావరణాన్ని చూపిస్తాడు. పోటీకి ఏ పెద్ద బడ్జెట్ సినిమా లేదు కాబట్టి కలక్షన్స్ పరంగా కూడా ఢోకా ఉండదు. పండగ రోజు ఖచ్చితంగా సినిమా చూడాలనుకునేవారు ఒక్కసారి మన బంగార్రాజుని పలకరించి రావచ్చు. డిస్సపాయింట్ మాత్రం కారు.
పరిటాలమూర్తి ఇచ్చే రేటింగ్ 2.5 / 5