మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ మల్టీస్టారర్స్ గా చేస్తున్న సినిమా ఆచార్య. సూపర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దీన్ని చాలా ప్రస్టేజియస్ గా తెరకెక్కిస్తున్నాడు. అన్నీ బాగుంటే ఈపాటికి థియేటర్స్ లో రిలీజై ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చి ఉండేది ఈసినిమా. కానీ, కొన్ని కారణాల వల్ల ఇది రిలీజ్ కి నోచుకోవట్లేదు. అంతేకాదు, ఏపీలో థియేటర్స్ టిక్కెట్ రేట్స్, అలాగే మిగతా స్టేట్స్ లో కరోనా లాక్డౌన్ , కర్ఫూల కారణంగా ట్రిబుల్, రాధేశ్యామ్ లాంటి సినిమాలే వాయిదా పడిపోయాయి. ఇక ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన ఆచార్య కూడా డౌట్ గానే కనిపిస్తోంది. ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికే యూత్ ని షేక్ చేసేస్తున్నాయి. ఎప్పుడో వచ్చిన లాహే లాహే సాంగ్ , రీసంట్ గా వచ్చిన చాలా కష్టం సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసేస్తున్నాయి. ఇందులో అన్నయ్య వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. వెండితెరపై ఈ సాంగ్స్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ టైమ్ లో ఆచార్య సినిమాలో హైలెట్స్ ఇవే అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ స్వయంగా ఒక ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో చిరు, రామ్ చరణ్ కలిసి స్టెప్పులు వేయబోతున్నారని అంటున్నారు. నిజానికి ఈ పాట షూటింగ్ చూడడానికి ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ స్పాట్ కి వచ్చిందని చెప్పారు కొరటాల. మరి ఈ సాంగ్ ఎప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు తండ్రీ కొడుకులు కలిసే సీన్స్, వాళ్లిద్దరి మద్యలో డైలాగ్స్ సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నాయని చెప్తున్నారు. సిద్ధ క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని, సినిమాలు ఫైటింగ్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నయట. మరి ఈసారి సినిమా వాయిదా పడకుండా రిలీజ్ అయితే మాత్రం అభిమానులకి పండగనే చెప్పాలి.

కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్ సరసన పూజాహెగ్దే హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. స్పెషల్ సాంగ్ లో రెజీనా చిరు సరసన స్టెప్పులు వేసింది. ఈ సినిమాకి మ్యూజిక్ మణిశర్మ అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *