థియేటర్స్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావట్లేదు. సంక్రాంతి పండక్కి వచ్చే కొన్ని సినిమాలకే ఇప్పుడు ఆడియన్స్ పరిమితం అయ్యారు. అయితే, ఓటీటీలో మాత్రం సినిమాల విడదల అనేది కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వెబ్ సీరిస్ లు ఈవారం అలరించబోతున్నాయి. అందుకే, ఇప్పుడు అందరూ సంక్రాంతి పండక్కి ఎలాంటి సినిమాలు ఓటీటీలో వస్తాయనేది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక్కసారి మనం ఈవారం రిలీజ్ కాబోయే సినిమాలని, అలాగే వెబ్ సీరిస్ లని ఒక్కసారి చూసినట్లయితే..,

యంగ్ హీరో ప్రిన్స్‌ కీలకపాత్రలో నటించిన సినిమా ‘ది అమెరికన్‌ డ్రీమ్‌ ఆహాలో రిలీజ్ కాబోతోంది. అమెరికాలో ఓ కుర్రాడికి ఎదురయ్యే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. విఘ్నేశ్‌ కౌశిక్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నేహా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14వ తేదిన ఈ సినిమా ఆహాలో ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇక అమెజాన్ లో మనం చూసినట్లయితే..,

హీందీ మూవీ గెహీరాయియా జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
అలాగే ఫ్రూత్రమ్‌ పూదు కాలాయ్‌ విదియాదా అనే తమిళ మూవీ కూడా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా సంక్రాంతికి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ సిరీస్ :

కన్నడ లో గరుడ గమన వృషభ వాహన జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

ఏబ్రెర్నల్స్‌ (తెలుగు డబ్బింగ్‌) జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హ్యూమన్‌ హిందీ జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు చూసినట్లయితే..,

అండర్‌ కవర్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్రేజన్‌ (హాలీవుడ్‌) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లర్కైవ్‌ 81 (వెబ్‌ సిరీస్‌) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యే కాలీ కాలీ ఆంఖే (హిందీ) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకా కొన్ని సినిమాలు ఎనౌన్స్ చేయాల్సి ఉంది. అలాగే, తెలుగులో అఖండ మూవీని కూడా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 17వ తేదిన ఈ సినిమాని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై తీస్కుని రావాలని చూస్తున్నారు. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *