ఓమైక్రాన్ ప్రభావంతో సంక్రాంతి సీజన్ లో భారీ సినిమాలు తప్పుకోవడంతో కొన్ని సినిమాలు రేస్ లోకి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో రానా దగ్గుబాటి హీరోగా నటించిన చిత్రం “1945” కూడా ఒకటి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆర్ఆర్ఆర్ రావలసిన డేట్ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమాలో రానా నటన అద్భుతంగా ఉంది. సీనియర్ నటులు నాజర్, సత్యరాజ్ ల గురించి చెప్పేదేముంది వారు తమ నటనతో సినిమాకి ప్రాణం పోశారు.

హీరోయిన్ గా రెజీనా కూడా ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో మంచి ఎమోషన్స్ ని ఆమె పండించారు. క్లైమాక్స్ లేని సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎక్కడో సినిమాలో సోల్ పక్కదారి పట్టినట్టుగా ఏదో మిస్సయినట్టుగా అనిపిస్తుంది. అలాగే చాలా సన్నివేశాలు ఎక్కడా పొంతన లేకుండా ఇరికించినట్టే అనిపిస్తుంది. ఇందులో మాత్రం దర్శకుని వైఫల్యాలే కనిపిస్తాయి. నిర్మాతతో ఇస్స్యూస్ వలన ఈ సినిమాలో తన పాత్రకు రానా డబ్బింగ్ చెప్పలేదు. వేరే వారి వాయిస్ తో రానాని ఈ సినిమాలో చూడటం కష్టంగా మారింది. అలాగే అర్థరహితంగా అర్ధాంతరంగా ముగిసిన ఈ సినిమా కలెక్షన్స్ మూడు రోజుల కలెక్షన్స్ కూడా అంతే తేడాగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలలో 350 వరకు థియేటర్స్ లో ఓవరాల్ గా రిలీజ్ అయిన ఈ సినిమాను అసలు జనాలు పట్టించుకోలేదు. దాంతో తొలిరోజే డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్, జనాలు లేక థియేటర్స్ లో షోలు ఆపేయడం లాంటివి కూడా జరిగాయి. మొదటి రోజు ఈ సినిమా 4.5 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు 3.75 లక్షల షేర్ ని రాబట్టింది. మూడవ రోజు మాత్రం ఈ సినిమా కాస్త బెటర్ గా 5.25 లక్షల షేర్ వసూల్ చేసింది. మొత్తం మీద మూడు రోజులకు ఈ సినిమా 14 లక్షల షేర్ 26 లక్షల గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి రికార్డు మూవీ స్థానంలో వచ్చిన 1945 సినిమా చెత్త రికార్డు సాధించింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు సైటర్లు వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *