గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కన్నడలో అరంగేట్రం చేయబోతున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో కీరిటీ రెడ్డి పరిచయం కాబోతున్నాడు. కిరిటీ చాలాకాలం నుంచీ యాక్టింగ్, డ్యాన్స్ ఫైట్స్ లలో శిక్షణ తీసుకున్నాడు. హీరో అవ్వాలన్నది ఎప్పటినుంచీ డ్రీమ్ గా పెట్టుకుని మరీ కసరత్తులు చేశాడు. అంతేకాదు, మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రత్యేకమైన శిక్షణని పొందాడు. అందుకే, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాకి శ్రీకారం చుట్టాడు. మాయా బజార్ అనే మూవీని కన్నడలో రాధాకృష్ణ డైరెక్షన్ లో చేస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నో విషయాలని మీడియాకి చెప్పారు. ‘నటుడు కావాలన్నది కిరీటి కల అని, ఇప్పటికే చాలా విషయాల్లో అతను బాగా ట్రైనింగ్ తీస్కున్నాడని చెప్పాడు. అంతేకాదు, పునీత్ రాజ్ కుమార్ జాకీ సినిమా స్పూర్థితోనే కిరీటీ హీరో అవుతున్నాడని చెప్పుకొచ్చాడు. సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగులో కూడా ఈసినిమాని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుంచీ వచ్చిన మంత్రి కొడుకులు హీరోలుగా బాగానే సక్సెస్ అయ్యారు. కానీ, తెలుగులో మాత్రం మార్కెట్ ని ఏర్పరుచుకోలేకపోయారు. కుమార స్వామి తనయుడు నిఖిల్, చెలువరాయ స్వామి కొడుకు సచిన్ లు కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఈసారి కిరీటీకి అయినా తెలుగులో మార్కెట్ వస్తుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *