పుష్ప సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. జనవరి 7వ తేదిన రాత్రి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. అల్లుఅర్జున్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో సందడి చేసింది. ఫస్ట్ టైమ్ అల్లుఅర్జున్ కెరియర్ లోనే పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కింది. హైఎస్ట్ వసూళ్లని సాధించింది. పుష్ప – ది రైజ్ కేవలం సౌత్ లోనే కాకుండా, హిందీలో సైతం సత్తాని చాటి మంచి వసూళ్లని కైవసం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ కూడా దాటి లాభాల బట పట్టింది. అయితే, జనవరి పండక్కి పెద్ద బడ్జెట్ సినిమాలు ఏమీ లేవు కాబట్టి, మరికొన్ని రోజులు థియేటర్స్ లో ఈ సినిమాకి కలక్షన్స్ బాగా వస్తాయని అభిమానులు ఆశ పడ్డారు. కానీ, వారందరి ఆశలపై నీళ్లు జల్లుతూ ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమైపోయింది.

ఇప్పటివరకూ ఈ సినిమా దాదాపుగా 300కోట్లకి పైగానే షేర్ ని సాధించింది. డిసెంబర్ 17వ తేదిన విడుదల అయిన ఈ సినిమా జనవరి 7న అంటే 22 రోజులకే ఓటీటీలో వచ్చేస్తోంది. హిందీలో తప్పించి, మిగతా అన్ని భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమాని ఇంత త్వరగా ఎందుకు ఇచ్చారు. భారీ రేటుకి అమ్మారా అనే సందేహాలు కూడా మొదలైపోయాయి. కానీ, ఈసినిమాని కేవలం 30కోట్ల లోపే రైట్స్ ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇది శాటిలైట్ రైట్స్ కంటే కూడా చాలా తక్కువేనట. అయినా కూడా థియేటర్స్ లో వీక్షించలేని వాళ్లు ఈ సినిమాని ఓటీటీలో చూడచ్చని ఇంత త్వరగా స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు, సాధ్యమైనంత త్వరగా సెకండ్ పార్ట్ ని కూడా షూటింగ్ ఫినిష్ చేసి రీలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ యేడాది చివర్లో సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ కాబోతోందని టాక్ వినిపిస్తోంది. అందుకే, పుష్ప ద రైజ్ ని ముందుగానే ఓటీటీలో ఇచ్చారని వచ్చిన లాభాలతో పుష్ప టీమ్ సంతృప్తిగా ఉందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *