ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ? ఇప్పుడు ఇదే ప్రశ్న ఫ్యాన్స్ లో మొదలైంది. అంతేకాదు, దీనిపై సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా బన్నీ బాలీవుడ్ ఎంట్రీ మన ఐకాన్ స్టార్ అంటూ ట్వీట్స్ తో ట్విట్టర్ ట్రెండింగ్ అయిపోతోంది. పుష్ప హీందీలో సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ ట్వీట్స్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. అంతేకాదు, లాస్ట్ టైమ్ ఒక ప్రెస్ మీట్ లో అల్లుఅరవింద్ సైతం బన్నీ బాలీవుడ్ ఎంట్రీ పై క్లూ కూడా ఇచ్చారు. అందుకే, అతి త్వరలో బన్నీ బాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమాకి రెడీ అవుతున్నాడా అనే వార్తలు ఇప్పుడు ఊపందుకున్నాయి.

నిజానికి పుష్ప ప్రమోషన్స్ అప్పుడు బన్నీ చాలాసార్లు తన బాలీవుడ్ ఎంట్రీ పై స్పందించాడు. మంచి కథ ఉంటే, నా క్యారెక్టర్ ఎక్సయిటింగ్ గా అనిపిస్తే ఖచ్చితంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పాడు. గతంలో కొన్ని ఆఫర్లు వచ్చాయి కానీ, అప్పుడు కుదర్లేదని, ఇప్పుడు ఖచ్చితంగా టైమ్ వచ్చిందని కూడా హింట్స్ ఇచ్చాడు బన్నీ. అయితే, బాలీవుడ్ లో మల్టీస్టారర్ మాత్రం చేయను అని చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే, స్ట్రయిట్ సినిమా చేయబోతున్నాడా..సోలోగానే ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, తెలుగులో కొద్దిగా పేరు వచ్చిన తర్వాత వేరే ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టమని , దానికి ధైర్యం కావాలని అన్నాడు. దానికి నేను ఎప్పుడూ రిస్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేశాడు. ఇక వేరే హీరోతో కలిసి యాక్ట్ చేయాలంటే అది కుదరని పని అని, అలాంటి క్యారెక్టర్స్ త్వరగా యాప్ట్ అవ్వవని చెప్పాడు బన్నీ. ఒకవేళ నా దగ్గరకి అలాంటి స్క్రిప్ట్ వచ్చినా నేను చేయనని ముందుగానే చెప్పేశాడు. బాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా కాకుండా సోలోగానే హీరోగా పరిచయం అవుతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరం.
ఇక పుష్ప సెకండ్ పార్ట్ కూడా పూర్తి అయిన తర్వాత తాను చేయబోయే సినిమాలు అన్నీ హిందీలో కూడా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయబోతున్నాడు. ముందుగానే అలాంటి స్క్రిప్ట్స్ ని ఒప్పుకుని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసేందుకు ఫిక్స్ అయిపోతున్నాడు బన్నీ. ఇక ఈ ఇంటర్య్వూ తర్వాత బన్నీ బాలీవుడ్ ఎంట్రీ పక్కా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *