బిగ్ బాస్ సీజన్ 5 ఇద్దరి ప్రేమజంటలని విడదీస్తోందా.. ఇప్పటికే షణ్ముక్ దీప్తిలు ఇన్ స్ట్రాగ్రామ్ సాక్షిగా బ్రేక్ అప్ చెప్పుకున్నారు. ఇక శ్రీహాన్ అండ్ సిరి కూడా త్వరలోనే బ్రేకప్ చెప్పుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు షణ్ముక్ ఫ్యాన్స్ ని కలవర పరుస్తోంది. బిగ్ బాస్ అనేది రియాలిటీ షో, అక్కడ ఎలా ప్రవర్తించాలో ఒక్కోసారి ముందుగానే స్క్రిప్ట్ పంపిస్తారని అర్ధం చేస్కోండి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో వీకండ్ నాగార్జున ముందరే ఇద్దరూ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నామని ఒప్పుకున్నారు. అక్కడ్నుంచీ బయట వీరి ప్రేమ, నిశ్చితార్ధం ఏమయిపోతుందా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు, ఒకరకంగా షణ్ముక్ ఓటమికి సిరితో క్లోజ్ గా ఉండటమే కారణం అయ్యిందా అనేది కూడా చాలామంది అభిప్రాయ పడుతున్నారు. నిజానికి జెస్సీ వెళ్లిపోయిన దగ్గర్నుంచీ వీరిద్దరూ ఒకరికొకరు బాగా క్లోజ్ అయిపోయారు. దీంతో అస్సలు బిగ్ బాస్ షో మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరిగింది. ఒకరిపై ఒకరు అలగడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి హగ్స్ చేసుకోవడం అనేది ప్రేక్షకులకి అసహనాన్ని తెప్పించింది. హౌస్ లో ఎలా ఉన్నా కూడా వీళ్లిద్దరూ బయటకి వచ్చాక వీరి లైఫ్ పార్టనర్స్ అని కమిట్ అయినవాళ్లని ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం దీప్తి సునయన- షణ్ముఖ్‌ బ్రేకప్‌ విషయం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 5ఏళ్లు రిలేషన్‌ షిప్‌లో ఉన్న ఈ జంట బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో విడిపోతారని నిజానికి ఎవరూ ఊహించలేదు. కానీ, తమ దారులు వేరంటూ షణ్ముఖ్‌తో దీప్తి సునయన తెగదెంపులు చేసుకుంది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చింది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునయన పార్టిసిపెంట్ గావెళ్లింది. అప్పటికే షణ్ముక్ తో రిలేషన్ లో ఉంది దీప్తి. ఇక రీసంట్ గా బ్రేకప్‌ అనంతరం తొలిసారి అభిమానులతో ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి సునయన ఎంతో ఎమోషనల్‌ అయ్యింది. ఇన్నేళ్లలో తన లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదని, ఇకపై వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను అంటూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. సడన్ గా లైవ్ ని డిస్ కనెక్ట్ చేసింది.
దీప్తి లైవ్‌ చాట్‌ తర్వాత కాసేపటికే షణ్ముఖ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. హృదయం ముక్కలైపోయిన ఎమోజీలను జత చేశాడు. ప్రస్తుతం షణ్నూ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. మరోవైపు ఇలాంటి కష్ట సమయంలో మేం అండగా ఉంటాం అంటూ షణ్ముఖ్‌ ఫ్యాన్స్‌ అతనికి సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు సిరి ఇంకా శ్రీహాన్ లో స్టోరీ కూడా ఇన్ స్ట్రాలో షేర్ అవుతోంది. శ్రీహాన్‌ కూడా త్వరలోనే సిరికి బ్రేకప్‌ చెప్పేస్తాడంటూ సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. కానీ, శ్రీహాన్ సిరితో కలిసి దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరి బర్త్‌డే సందర్భంగా శ్రీహాన్‌ ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్‌ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్‌. గాడ్‌ బ్లస్‌ యూ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. ఇక వీరిద్దరూ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, వీరి ఇన్ స్ట్రాగ్రామ్ లని ఇప్పుడు తెగ ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్ అందరూ.. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *