పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు పొలిటికల్ మీటింగ్స్ పెడుతూనే మరోవైపు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. భీమ్లానాయక్ సంక్రాంతి రేస్ లో నుంచీ తప్పుకున్నా కూడా తన తర్వాత సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇందులో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా నిజానికి సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ సరసన హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. రీసంట్ గా పవన్ కళ్యాణ్ గురించి తనదైన స్టైల్లో కామెంట్స్ చేసింది అమ్మడు. తనకి ఎంతో ఫెవరెట్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నానని అది నా అదృష్టం అని చాలాసార్లు చెప్పుకొచ్చింది. అయితే, రీసంట్ గా పవన్ చాలా టెర్రిఫిక్ పెర్ఫామన్స్ చెస్తారని, వన్ మాన్ షోలాగా తన పెర్ఫామన్స్ ఉంటుందని , ఇంకా ఆ దేవుడి ఆశీస్సులు కలిగిన వ్యక్తి అని కామెంట్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడటంతో నిధీ అగర్వాల్ కామెంట్స్ ని తెగ షేర్లు చేసేస్తున్నారు ఫ్యాన్స్.
దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హరి హర వీరమల్లు కోసం భాగ్యనగరపు అందాలని సెట్స్ గా రూపొందించారు. అంతేకాదు, అప్పట్లో కళాకృతులు ఎలా ఉండేవో అచ్చం అలాగే ఈ సెట్స్ ని వేసినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సెట్స్ పై షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో నిధి అగర్వాల్ పంచమి అనే క్యారెక్టర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యామ్ పోరాటలు సినిమాలో ఉండబోతున్నాయి. జనవరి నుంచీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అంటున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా మరికొందరు స్టార్ హీరోలు కూడా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అతి త్వరలోనే అన్ని పాత్రలకి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేయాలని క్రిష్ టీమ్ భావిస్తోంది. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *