ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో.. వాడే లైగర్ అన్నట్లుగా ఉంది గ్లింప్స్. గ్లింప్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కి నిజంగానే దిమ్మతిరిగిపోతోంది. మరోసారి అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తూ ఛాయ్ వాలాగా పెరిగిన విజయ్ చివరికి వరల్డ్ నెంబర్ వన్ బాక్సర్ అయ్యాడా అన్నట్లుగా సాగింది ఈ గ్లింప్స్. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా అని అన్నప్పుడే అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులోనూ పూరీజగన్నాధ్ మార్క్ అండ్ మాస్ డైలాగ్స్ ఇందులో ఉంటే ఫ్యాన్స్ కి పూనకాలే. కొత్త సంవత్సరం కానుకగా లైగర్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో విజయ్ లుక్ చూస్తుంటే రఫ్పాడించేస్తున్నాడు.
లేడీస్ అండ్ జెంటిల్ మన్ మీరు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది అంటూ ఒక ఎలికాఫ్టర్ ఏరియల్ వ్యూలో స్టార్ట్ అయ్యింది ఈ చిన్నపాటి గ్లింప్స్. MMA World ChampionsShip పోటీల్లో భాగంగా ఇండియా నుంచీ వచ్చిన విజయ్ రింగ్ లో చితక్కొట్టేస్తున్నాడు. ముంబై వీధుల్లో స్లమ్ డాగ్, ఛాయ్ వాలాగా పెరిగిన లైగర్ ఇక్కడి వరకూ ఎలా వచ్చాడా అన్నది చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోంది. అంతేకాదు, ఈ గ్లింప్స్ లోనే విజయ్ మదర్ గా ఒకవైపు ఛాయ్ వాలా సైకిల్ తొక్కుతూ రమ్యకృష్ణని కూడా చూపించారు. విజయ్ మార్క్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో గ్లింప్స్ ని చూపించి ఇప్పుడు సినిమాపై అంచనాలని భారీగా పెంచేసింది పూరీజగన్ టీమ్.

అంతేకాదు, పాన్‌ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా ఇందులోనే ప్రకటించారు. ఆగష్టు 25 2022 లో సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లైగర్ చేసిన ఫైట్ మూమెంట్స్ సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నాయి. అలాగే, ఈ సినిమాలో మైక్ టైసన్ గెస్ట్ ఎప్పీరియన్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మైక్ టైసన్ కి బాలయ్యబాబు డబ్బింగ్ చెప్పబోతున్నట్లుగా న్యూస్ కూడా వినిపిస్తోంది. మరి ఈ లైగర్ ఎలా ఉంటాడో తెలియాలంటే మనం రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *