ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ అంటూ కుర్రాళ్లని ఒక ఊపు ఊపిన సమంత ఇప్పుడు గోవాలో హాలీడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. విడాకుల అనంతరం సినిమాలపై సినిమాలని ఒప్పుకుంటూ తన దూకుడు పెంచుకుంటూ వెళ్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకి సైతం సై అంటూ సైన్ చేసేసింది. ఇక సినిమా షూటింగ్స్ కి ఏమాత్రం గ్యాప్ దొరికినా ఇలా హాలిడే వెకేషన్ అంటూ రెచ్చిపోతోంది. రీసంట్ గా యశోదా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న శామ్ గోవాకి వెళ్లి రెచ్చిపోయింది. తన ఫ్రెండ్స్ అయిన శిల్పారెడ్డితో కలిసి ఈ టూర్ ని ఎంజాయ్ చేస్తోంది.
దీనికి సంబంధించిన పిక్స్ ని తన ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేసింది. గోవా యూ బ్యూటీ అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫోటోలని షేర్ చేసింది. బికినీలో స్విమ్ సూట్ వేసుకుని వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చున్న సమంత అందాలని కుర్రాళ్లు తెగ ఆనందించేస్తున్నారు. ఈ ఫోటోలని తెగ షేర్లు చేసేస్తున్నారు. ఇక మరోవైపు వరుణ్ ధావన్ తో కలిసి ఒక వెబ్ సీరిస్ చేసేందుకు కూడా రెడీ అయినట్లుగా సమాచారం. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *