షూటింగ్ పూర్తి… విడుదలకు సిద్ధం!
హీరో అర్జున్ యాదవ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణ

ప్రేమ, భావోద్వేగాలు, మధుర జ్ఞాపకాల సమ్మేళనంగా తెరకెక్కిన అందమైన ప్రేమకథా చిత్రం ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పి.వి. అర్జున్ యాదవ్, అదితి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మిస్తుండగా, హరికృష్ణ పామంజి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలైన లిరికల్ సాంగ్స్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సంగీత దర్శకుడు అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, హృదయాలను తాకే సాహిత్యం ప్రేక్షకులను అలరిస్తూ సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

ఈ చిత్రంతో పి.వి. అర్జున్ యాదవ్ హీరోగా టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రేమ, త్యాగం, భావోద్వేగాలతో నిండిన పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను కదిలించనుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. తొలి సినిమానే అయినప్పటికీ, అర్జున్ యాదవ్ ఎంతో పరిణతి చెందిన నటుడిగా కనిపిస్తూ, లవర్ బాయ్ పాత్రలోనూ, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేయనున్నాడు. ముఖ్యంగా ఆయన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.

హీరోయిన్ అదితితో అర్జున్ యాదవ్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశంగా నిలవనుంది. వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథ, భావోద్వేగ ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

దర్శకుడు హరికృష్ణ పామంజి ప్రేమ, భావోద్వేగాలు, జీవితంలోని మధురమైన అనుభూతులను అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరపై ఆవిష్కరించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను కట్టిపడేసేలా కథనం సాగుతుందని యూనిట్ సభ్యులు వెల్లడిస్తున్నారు.

ఇక సినిమాటోగ్రాఫర్ తేజ .ఎ ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా అద్భుతంగా మలిచారు. రిచ్ విజువల్స్, హృదయాన్ని హత్తుకునే సంగీతం, భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ ప్రేమకథా చిత్రాల అభిమానులకు ఓ మధురానుభూతిని అందించనుంది.

త్వరలో ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.

నటీనటులు:

పి.వి. అర్జున్ యాదవ్, అదితి తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కథ – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: హరికృష్ణ పామంజి
నిర్మాత: పి.వి. నరసింహ యాదవ్
బ్యానర్: శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్
సంగీతం: అర్మాన్ మెరుగు
ఎడిటర్: అలతోర్ రాజేష్
సినిమాటోగ్రఫీ (DOP): తేజ .ఎ
ఆడియో లేబుల్: మ్యాంగో మ్యూజిక్
పీఆర్ఓ: కృష్ణ ప్రసాద్ (కేపీ)

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *