టాలీవుడ్ లో సైలెట్ హీరోగా తనదైన మార్క్ వేసుకుంటున్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. రీసంట్ గా కస్టడీతో పర్వాలేదనిపించి, అక్కినేని కుటుంబం ఫ్లాప్ లకి చెక్ పెట్టాడు. అంతేకాదు, అక్కినేని ఫ్యాన్స్ ని ఉద్దేశ్యించి స్టేజ్ పైన మీరంతా మా ఫ్యామిలీ అంటూ కలుపుకుని పోయాడు. గతంలో లేని విధంగా ఇప్పుడు నాగచైతన్య సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. సమంతతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేకమైన బంగ్లాని సైతం కొనుకున్నాడు. అటు అక్కినేని కుటుంబం వారసుడిగా, ఇటు దగ్గుబాటి వారి మనవడుగా నాగచైతన్య తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. అంతేకాదు, ఆస్తుల్లో కూడా తనదైన మార్క్ వేస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. అక్కినేని వారసుడిగా నాగచైతన్య ఆస్తులు చూసి ఫ్యాన్స్, ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

నాగార్జున మొదటి భార్య కు పుట్టిన సంతానం నాగ చైతన్య అయితే ఏవో కారణాలవల్ల మొదటి భార్య తో నాగార్జున విడిపోయాడు.. నాగార్జున మొదటి భార్య లక్ష్మి యూఎస్ లో ఒక డాక్టర్ ని మళ్ళీ పెళ్లి చేసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ లక్ష్మి ఒంటరిగా మిగిలిపోకుండా అలా పెళ్లి చేసుకోవడం దగ్గుబాటి అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది.. చెల్లెలు ఇలా అయిపోయిందని వెంకటేష్ బాధను, కూతురు అలా అయిందనే రామానాయుడు బాధను తీర్చి లక్ష్మి జీవితంలో సెటిల్ అయ్యిందని అనుకున్నారు..

విడాకులు అయిన తరువాత నాగార్జున నాగ చైతన్య బాధ్యతను తానే తీసుకున్నాడు. అంతేకాదు, కోటీశ్వరుడు అయిన తన మారుతండ్రి ఆస్థి అంతా చైతు కి రాశారట..అలా నాన్న తరపున ఆస్థి, అమ్మ తరపున ఆస్థి తో చైతు కోటీశ్వరుడు అయ్యాడనేది టాక్. అంతేకాదు, ఇటు సైడ్ నుంచీ దగ్గుబాటి వారి ఆస్తి కూడా తన ఖాతాలో పడింది. దీంతో మరింత డబ్బు సంపాదించాడు చై. ఒకవైపు తను కష్టపడుతూ సినిమాలు చేస్తూనే ఇలా కుటుంబ పరంగా ఆస్తి కలిసి రావడం కూడా చై కి అదృష్టంగా మారిందనేది టాక్. ఈ ఆస్తిపైన నాగచైతన్యకి నెలకి 2కోట్ల వరకూ ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఇలా చూస్తే సంవత్సరానికి 24కోట్లు వస్తుంది. ఆ ఆస్తి విలువలు అన్నీ కలిపితే దాదాపుగా 200కోట్లకి పైనే ఉంటాయి. అంతేకాదు, అన్నపూర్ణ స్టూడియోస్ పై వచ్చే ఆదాయం కూడా మనోడి ఖాతాలో వస్తుందని అంటున్నారు. మరోవైపు నుంచీ తన సినిమాల రెమ్యూనిరేషన్స్ ఎలాగో వస్తాయి. ప్రస్తుతం వరసుగా చేతినిండా సినిమాలతో చై చాలా బిజీగా ఉన్నాడు.

అంతేకాదు , చై స్వతహాగా రేసర్ కావడంతో €ఎన్నో కోట్ల ఖరీదు చేసే కార్లు సైతం చై ఇంట్లో ఉంటాయి. వీటి విలువ కూడా దాదాపుగా 50కోట్లు పైనే ఉంటుందని అంచనా. దీనితో పాటుగా అత్యత ఖరీదైనా ఫెరారీ 488 జీటిబి, బీఎం డబ్య్లూ 740 ఎల్ ఐ, నిస్ాన్ జిటిఆర్, ల్యాడ్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జి – క్లాస్, కార్లు ఉన్నాయి. వీటితో పాటుగా రెగ్యులర్ గా తిరిగే MV అగస్టా, BMW 9RT, బైక్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య ఉండే ఇల్లు దాదాపుగా 20కోట్లు పైనే ఉంటుంది. దీంతోపాటుగా నాగచైతన్యకి రకరకాల బిజినెస్ లు కూడా ఉన్నాయి. కొన్ని రకాల హైయిర్ ఆయిల్ ప్రోడెక్ట్స్ , బ్యూటీ ప్రోడక్ట్స్ ఇలా చాలా బిజినెస్ లు ఉన్నాయి. రీసంట్ గా ఫుడ్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టాడు చైతన్య. షోయి ద్వారా ఆసియన్ వంటకాలని అందిస్తున్నారు. అలాగే, రానాతో కలిసి ప్రొడక్షన్ బిజినెస్ లోకి అడుపెట్టాడు. ఇలా వ్యాపార రంగంలో సైతం తనదైన ముద్రని వేస్తున్నాడు చైతన్య. ఇక నాగచైతన్య ఆస్తులు చూసి ఇండస్ట్రీలో అందరూ షాక్ తింటున్నారు. ముఖ్యంగా తన తండ్రిలాగానే తను కూడా బిజినెస్ ట్యాక్టీస్ వాడుతున్నాడని, సినిమాలు కూడా సెలక్టివ్ గా చేసుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. సమంత తో విడిపోయిన తర్వాత కొద్దిగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే తన అభిమానులకి దగ్గరవుతున్నాడు నాగచైతన్య. మొత్తానికి అదీ మేటర్.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *