విపరీతమైన హైప్ తో విజయ్ దేవరకొండ కెరియర్ లోనే హైఎస్ట్ బడ్జెట్ తో వచ్చిన సినిమా లైగర్. హిందీలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పూరీ జగన్నాధ్ డైరెక్షన్, విజయ్ ఫైటర్ గా ఎప్పీరియన్స్, మైక్ టైసన్ స్క్రీన్ ప్రజంట్ ఉండటంతో ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని థియేటర్స్ ముందు క్యూ కట్టారు. మరి ఈ సినిమా హిట్ అయ్యిందా ఫట్ అయ్యిందా తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

అసలు ఈ సినిమా కథేంటి ?

మిక్స్ డ్ మార్షన్ ఆర్ట్స్ లో లైగర్ అంటే విజయ్ దేవరకొండని నేషనల్ ఛాంపియన్ గా చూడాలని అనుకుంటుంది లైగర్ తల్లి బాలామణి అంటే రమ్యకృష్ణ. తన కల నెరవేర్చుకోవడం కోసం కరీంనగర్ నుంచీ ముంబైకి వస్తుంది. తన భర్త కూడా ఫైటర్ అవ్వడం వల్ల లైగర్ ఫస్ట్ నుంచీ ఫైటింగ్స్ బాగా చేస్తుంటాడు. తన కొడుకుతో కలిసి టీ స్టాల్ రన్ చేస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే లైగర్ కి తానియా అంటే అనన్యపాండే పరిచయం అవుతుంది. ఆమె ప్రేమలో పడతాడు లైగర్. తల్లికి తెలియకుండా ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. లైగర్ కి నత్తి ఉందని తెలిసిన తానియా దూరమైపోతుంది. దీంతో ప్రేమలో విఫలమై మళ్లీ ఫైటింగ్ పై దృష్టి పెడతాడు లైగర్. మరి ఈ లైగర్ అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడా ? నేషనల్ ఛాంపియన్ అయ్యాడా లేదా ? సినిమాలో మైక్ టైసన్ అసలు ఎవరు ? లైగర్ ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్..

ఈ సినిమాకి విజయ్ చేసిన హార్ట్ వర్క్ నిజంగా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. తన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ చాలా బాగా యాప్ట్ అయ్యాడు. సినిమాని ఒంటిచేత్తో తీసుకుని వెళ్లాడు. ఇక పూరీ స్టైల్ డైరెక్షన్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ బ్యాంగ్ , మైక్ టైసన్ ఎంట్రీ, క్లైమాక్స్ 30 నిమిషాలు సినిమాని నిలబెట్టింది. మిక్స్ డ్ మార్షన్ ఆర్ట్స్ సీన్స్ కూడా స్క్రీన్ పైన బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్..

పూరీ జగన్నాధ్ కి ఉన్న బలమే హీరోతో డైలాగ్స్ చెప్పించడం. కానీ, హీరోకి నత్తి పెట్టడం వల్ల తన ఎక్కిన కొమ్మని తానే నరుక్కున్నట్లుగా అయ్యింది. పూరీ మార్క్ డైలాగ్స్ మిస్ అయ్యాయి. అలాగే, హీరో మదర్ క్యారెక్టర్ ఫస్టాఫ్ లో ఉన్న పవర్ సెకండ్ హాఫ్ లో లేకుండా పోయింది. ఇక స్క్రీన్ ప్లే కూడా పూరీ జగన్నాధ్ కొద్దిగా తడబడ్డాడా అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఆసక్తిగా లేకపోయినా, సెకండ్ హాఫ్ లో ఇంకా ఏదో ఉందనుకుని చూసే ప్రేక్షకుడు కొద్దిగా నిరాశపడ్డాడు. హీరో – విలన్ పాత్రలు తప్పిస్తే మిగతా క్యారెక్టర్స్ స్క్రీన్ పైన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. అనన్యపాండేతో లవ్ ట్రాక్ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కథ కూడా రొటీన్ గా ఉండటం, ప్రేక్షకుడు ఊహించిన సీన్స్ ఉండటం అనేది సినిమాకి మైనస్ గా చెప్పుకోవచ్చు.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే..,
విజయ్ ఫైటర్ గా మెప్పిస్తాడు కానీ, లైగర్ గా అలరించలేకపోయాడు. పూరీ మార్క్ సినిమాలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. వీకండ్ ఖాళీగా ఉంటే విజయ్ దేవరకొండ కోసం సినిమాకి వెళ్లచ్చు.

రేటింగ్ 2 అవుట్ హాఫ్ 5

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *