రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకి తగ్గట్లుగానే పూరీ మార్క్ తో వచ్చిన ట్రైలర్ విశేషంగా అందర్నీ ఆకట్టుకుంది. పక్కా మాస్ యాక్షన్ కి రెడీ అయిపోమని సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఒక రేంజ్ లో బిజినెస్ ఆపర్లు వస్తున్నట్లుగా టాక్. అంతేకాదు, ఈ రేటు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు కూడా విస్తుపోతున్నారట. దీంతో ‘లైగర్’ కు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జరగని విధంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వెనక్కి రాబట్టే అవకాశాలు ఈ సినిమాకి కనిపిస్తున్నాయి.

శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ , ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఇలా మొత్తం కలుపుకుని ఇప్పటికే 55 కోట్ల నుండి రూ. 60 కోట్ల రేటు వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ రేటు కంటే ఎక్కువ మొత్తానికే పూరీ అండ్ టీమ్ వర్కౌట్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా ని కరణ్‌ జోహార్‌, ‘పూరీ కనెక్ట్స్‌’ ద్వారా పూరీ జగన్నాధ్, హీరోయిన్ ఛార్మీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి తల్లిగా రమ్యకృష్ణ యాక్ట్ చేస్తుండటం అనేది మరింత బిజినెస్ వచ్చేలా చేస్తోంది. అంతేకాదు, అన్ని ఏరియాలు కలుపుకుని ఈ సినిమాని చాలా ఫ్యాన్సీ రేటుకి అమ్ముతున్నట్లుగా కూడా చెప్తున్నారు.

ఇక వేరే భాషల్లో కూడా సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. వేరే భాషల్లో కూడా మంచి రేటుకి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని ఎగరేసుకుపోయేటట్లుగానే కనిపిస్తున్నారట. అంతేకాదు, హిందీలో ఓన్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ అండ్ టీమ్ భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచీ ఈ రేంజ్ మార్కెట్ ని కొట్టబోతున్న హీరోగా విజయ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడనడంలో సందేహం లేదని చెప్తున్నారు ట్రేడ్ నిపుణులు. మొత్తానిగి లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ క్రియేట్ చేసేలాగానే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *