గ్లోబల్ స్టార్ కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత నటించిన చిత్రం ‘విక్రమ్’. యంగ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తన సొంత బ్యానర్లో కమల్ నిర్మించడం విశేషం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ లేకుండా ఐదుగురు స్టార్ హీరోలతో మొదటి నుంచి చివరి వరకూ లోకేశ్ కథను నడిపించిన తీరుపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. కమల్ స్థాయి తగ్గకుండా అందరిని బ్యాలన్స్ చేస్తూ ఈ కథను లోకేష్ ముందుకు తీసుకుని వెళ్లాడు. దాంతో ఈ సినిమా అటు కోలీవుడ్ .. ఇటు టాలీవుడ్ లోనే కాదు, విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.

రాష్ట్రాల వారీగా ఈ సినిమా కలెక్షన్స్ ను చూస్తే..,

Tamilnadu – 75.60Cr
Telugu States- 15.56Cr
Karnataka- 13.80Cr
Kerala – 18.05Cr
ROI – 3.25Cr
Overseas – 66.15CR
Total WW collection – 195.51CR

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 195. 51 కోట్ల షేర్ 300 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి సాలిడ్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నేటితో 200 కోట్ల షేర్ క్లబ్ లోకి చేరనుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా 8 కోట్ల షేర్ 16 కోట్ల గ్రాస్ వసూల్ చేసి పంపిణీదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

చాలా గ్యాప్ తరువాత హీరోగా .. నిర్మాతగా భారీ సక్సెస్ ను కమల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంతోషంలో ఆయన ఈ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి ఖరీదైన కారును కానుకగా అందజేశారు. కోటి రూపాయలకి పైగా ఖరీదైన ‘లెక్సస్ సెడాన్’ కారును కానుకగా లోకేశ్ అందుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. లోకేశ్ ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చాడనీ .. అలాంటి వాళ్లంటే తనకి ఇష్టమని చెబుతూ వచ్చిన కమల్, అతని పట్ల తనకి గల అభిమానాన్ని ఇలా చాటుకోవడం విశేషం. కమల్ ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ తో లోకేష్ ఎమోషనల్ అయ్యాడు. తన భావోద్వేగాన్ని తెలియచేస్తూ సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్లు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *