దర్శకుడు గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విజయంతో ఏకంగా నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశాన్ని పట్టేశాడు. రాయలసీమ నేపథ్యంలో గోపీచంద్ చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు 40 శాతం పూర్తయింది. మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పాజిటివ్ రెస్పాన్స్ పట్టేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా టీజర్ ను ఈ నెల 10న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ రివీల్ చేస్తూ టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకి అన్నగారు, జై బాలయ్య, వీర సింహారెడ్డి, వేటపాలెం అనే టైటిల్స్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కానీ ఫైనల్ గా ఈ సినిమాకి ‘రెడ్డి గారు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇదే టైటిల్ ను ఛాంబర్ లో కూడా రిజిస్టర్ చేసినట్లు చెబుతున్నారు. ఇదే టైటిల్ ను బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించనున్నారని ఫిలిం వర్గాలలో చర్చ జరుగుతోంది. దునియా విజయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమా అవుట్ ఫుట్ చూసి హ్యాపీగా ఫీల్ అయిన నిర్మాణ సంస్థ గోపీచంద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ‘రెడ్డి గారు’తో హిట్ కొడితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే అవకాశం ఇస్తామని చిత్ర నిర్మాణ సంస్థ చెప్పినట్లు టాక్ నడుస్తోంది. దాంతో గోపిచంద్ ఈ సినిమాని చాలా కసిగా తీస్తున్నాడు. బడ్జెట్ కంట్రోల్ దాటిపోయినా సినిమాపై నమ్మకంతో మైత్రి మూవీ మేకర్స్ కూడా అందుకు అడ్డుచెప్పడం లేదని తెలిసింది. గీతా గోవిందం సినిమా తప్పా హిట్స్ లేని పరుశురామ్ కు సర్కారు వారి పాటతో మహేష్ అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ‘రెడ్డి గారు’తో హిట్ కొడితే మహేష్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని గోపీచంద్ అందుకుంటాడని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ అవకాశాన్ని గోపీచంద్ అందుకుంటాడా? లేదా? తెలియాలంటే దసరా వరకు ఆగవలసిందే. ఎందుకంటే రెడ్డి గారు సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అది మ్యాటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *