కొమురం భీముడో పాటకి , ప్రతి పదానికి
అర్ధం ఏంటో తెలుసా..?

ట్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీముడో పాట ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. ప్రతి భాషలోనూ ఈపాట సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ పాట తెలంగాణా యాసలో ఉంది. సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన లిరిక్స్ తో రోమాలు నిక్కబొడుకునేలా కాళభైరవ ఈ పాట పాడాడు. అయితే, ఈపాటకి అసలు అర్దం ఏంటి. 1920ల్లో ఉండే తెలంగాణా స్లాంగ్ ని, గోండుజాతి పదాలని ఇందులో ఉన్న ఈ పాటకి తెలుగు పదాల్లో అర్ధాలని వెతుకున్నారు అందరూ. ఈపాటకి మనం అర్ధాన్ని చూసినట్లయితే.,

ఫస్ట్ కొమురం భీమ్ తన ప్రతిబింబాన్ని చూసుకుని పాడే పాట ఇది. భీమా.. నిను గన్న నేలతల్లి
ఊపిరి బోసిన సెట్టు సేమ , పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా
ఇనపడుతుందా…, అంటూ పాట మొదలు అవుతుంది.
కొమురం భీముడో
కొమురం భీముడో
కోర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో అంటే., ఎక్కడా లొంగిపోవద్దు, ఎక్కడా వెనకడు వేయద్దు అని అర్ధం వస్తుంది. కొర్రాసు అంటే కట్టె మనం పొయ్యులో వాడే కట్టెలు లాస్ట్ వరకూ అంటే చివర్లో కాలే వరకూ మండాలి అని, ఏదైతే బూడిదగా మారిపోయి ఉన్నా కట్ట అంతా కాలిపోతున్నా సరే ఆ అంచు కూడా మండాలి. అలా నీలో చైతన్యం ఉండాలి అని అర్దం వస్తుంది. ఎక్కడా చివరి ఊపిరి వరకూ కూడా అలసిపోకుండా పోరాడు అనే అర్ధాన్ని చిన్న మాటలో రాశారు.

రగరాగ సూరీడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో అంటే, సూర్యుడు ఎలా ఉంటాడో తెలుసు. ప్రతాపవంతమైన సూర్యూడి కిరణాలు మబ్బులు అడ్డొచ్చినా సరే కమ్ముకోకుండా రగలాలి అంటే ప్రసరించాలి.. ఎక్కడా ఆగద్దు అని అర్ధం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి అని.

ఇక్కడ పల్లవిలోనే మండాలి, వెలగాలి అనే ప్రాసతోని రెండింటిని పోల్చారు.

తర్వాత ,,.
కాల్మొక్తా బాంచెహాని వొంగి తోగాల
కారడవి తల్లికి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో అంటే., కాల్మొక్తా బాంచెన్ అని నువ్వు తగ్గితే, అంటే వంగితే కనక నీ పౌరుషం పోయినట్లే అని, నిన్ను చంపేస్తారు.., తొక్కేస్తారు అని, అలాంటపుడు నువ్వు ఎలా అడివి తల్లికి పుట్టినట్లు అవుతుంది అని అర్దం. గోండుల ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే విధాంగా రాశారు.

తర్వాత
జులుము గద్దెకు తలను ఒంచితోగాలా
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో
పెరగానట్టేరో .. జలుము గద్దెకు అంటే నీపైన జులుము చేసేవారికి అంటే అధికారం చలాయించే వారికి తల ఒంచితే, బ్రిటిష్ వారికి నువ్వు తల వంచింతే, జుడము తల్లికి అంటే అడివి తల్లికి పేగు తెంచుకుని పుట్టినట్లు కాదు అంటూ.., అర్ధం వస్తుంది.

తర్వతా మనం చరణంలో చూసినట్లయితే..,
సెర్మమొలిసే దెబ్బకు ఒప్పంటోగాల – అంటే చర్మం ఒలుస్తూ మనల్ని హింసిస్తున్నా కూడా వాటిని తట్టుకోలేకపోతే., ఓర్చుకోలేకపోతే., అని అర్ధం వస్తుంది. ఇలా ఓర్చుకోలేకపోతే.,
సిలికే రత్తము సూసి సెదిరేతోగాల – ధైర్యం గనక చెదిరిపోతే, రక్తం చూసి మనం ధైర్యం చెదిరిపోతే అని అర్ధం..
బుగులేసి కన్నీరు ఒలికితోగాల – అంటే భయం వేసి కన్నీరు వస్తే., ధైర్యం చెదిరిపోయి భయం వేస్తే గనక
భూతల్లి సనుబాలు తాగనట్టేరో – నువ్వు ఈ భూతల్లి పాలు తాగిపుట్టిన బిడ్డవే కాదని అర్ధం..

కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు – అలాంటి రక్తం ఏరులై పారుతున్నా కూడా నీ ధైర్యం భయపడకూడదు. అది నేలమ్మకి నుదుటి బొట్టయ్యింది. అలాగే అమ్మకాళ్లకి పారాణి అవుతోంది. అలాంటి తల్లి పెదవుల చిరునవ్వు ని చూడాలి అంతే.. నీ జన్మని భూమితల్లికి ఇచ్చేసేయ్.. అంతకంటే రుణం ఎలా తీర్చుకుంటావ్ అంటూ అర్ధం వస్తుంది.
ఎంతో దమ్మున్న పాటకి ఎన్టీఆర్ ఇచ్చిన హావభావాలకి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *