బాలయ్య రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయినకరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదలైన అఖండ, పుష్ప సినిమాలు విజయాన్ని సాదించి టాలీవుడ్ లో జోష్ ను నింపాయి. 15 రోజుల గ్యాప్ లో విడుదలైన ఈ సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అఖండ బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టగా పుష్ప సినిమా మాత్రం తెలుగులో తప్పా మిగిలిన అన్నీ ఏరియాలలో లాభాల పంట పండించింది. అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన నేనే, బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగ్స్ పాపులర్ కాగా పుష్ప చిత్రంలో బన్నీ చెప్పిన తగ్గేదెలా డైలాగ్ పాపులర్ గా మారాయి.

ఈ రెండు సినిమాలు థియేటర్లలలో సందడి చేసే సమయంలోనే ఓటీటీలలో విడుదలయ్యాయి. అఖండ డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో విడుదల కాగా పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. థియేటర్లలలో సందడి చేసిన ఈ సినిమాలో ఓటీటీలలో కూడా తమ హవాని కొనసాగించాయి. హైయెస్ట్ స్ట్రీమింగ్ హావర్స్ తో ఈ రెండు సినిమాలు నయా రికార్డును క్రియేట్ చేశాయి. పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా 50 రోజుల్లో 360 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా అఖండ సినిమా 50 రోజుల్లో 132 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. పుష్ప సినిమా బాలీవుడ్ లో అయితే ఏకంగా 105 కోట్లకు పైగా వసూల్ చేసి నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పింది.

అఖండ రికార్డులను బ్రేక్ చేస్తూ వచ్చిన పుష్ప సినిమా ఓ విషయంలో మాత్రం బాలయ్య రికార్డుకు మాత్రం దూరంగానే ఉండిపోయింది. 50 రోజుల సెంటర్స్ లో బాలయ్య క్రియేట్ చేసిన రికార్డును పుష్ప బ్రేక్ చేయలేకపోయింది. బాలయ్య నటించిన అఖండ సినిమా 50 రోజులు 105 సెంటర్స్ లో ఆడగా పుష్ప సినిమా మాత్రం కేవలం 24 సెంటర్స్ లోనే 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూడవ వారంలో అంటే జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం వలనే 50 రోజుల థియేటర్లు తగ్గాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అఖండ విషయానికి వస్తే డిసెంబర్ 2న థియేటర్లలలో విడుదలైన ఆ సినిమా జనవరి 21న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. 50 రోజుల సెంటర్స్ తప్పా మిగిలిన అన్నీ రికార్డులను పుష్ప పేరిటే ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *