ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఎప్పుడూ చూడని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. సుకుమార్ కథాకథనాల్ని రసవత్తరంగా నడపడం ద్వారా ఎంటర్టైన్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. ఇక మాస్ మెచ్చే ఎలివేషన్ సీన్లకు ఇందులో లోటే లేదు. హీరో క్యారెక్టర్.. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అదిరిపోవడంతో ‘పుష్ఫ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ తో జనవరి 7న ఓటీటీలలో విడుదలయింది. దీంతో తెలుగు లో ఆల్ మోస్ట్ కలెక్షన్స్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చినా హిందీ లో ఇప్పటికీ కలెక్షన్స్ ని సాధిస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

బన్నీ నటించిన ఈ సినిమా ఓటీటీలలో ఒకపక్క సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉంటే మరో పక్క కలెక్షన్స్ పరంగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 4 వ వారంలో డిజిటల్ రిలీజ్ అయినా 2 వారాలు కావోస్తున్నా ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇక థియేట్రికల్ కలెక్షన్స్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 38 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. హిందీ లో అయితే ఏకంగా 1.4 కోట్ల నెట్ వసూళ్లు రాగా టోటల్ గ్రాస్ లెక్క ఇప్పుడు 338 కోట్ల మార్క్ ని అందుకుంది.

Nizam: 40.71Cr
Ceeded: 15.15Cr
UA: 8.13Cr
East: 4.89Cr
West: 3.95Cr
Guntur: 5.13Cr
Krishna: 4.26Cr
Nellore: 3.08Cr
AP-TG Total:- 85.30CR(133.15CR~ Gross)
Karnataka: 11.67Cr
Tamilnadu: 12.22Cr
Kerala: 5.55Cr
Hindi: 44.10Cr
ROI: 2.23Cr
OS – 14.53Cr
Total WW: 175.60CR(338CR~ Gross)

146 కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమా 175.60 కోట్ల షేర్ వసూల్ చేసి బయ్యర్స్ కు ఏకంగా 29.60 కోట్ల ప్రాఫిట్ ఇచ్చింది. ఒకవైపు కరోనా పరిస్థితులు, ఏపీలో టికెట్ ధరల తగ్గింపు లాంటి పరిస్థితుల మధ్య కూడా ఈ సినిమా పంపిణీదారులకు భారీ ప్రాఫిట్ తీసుకురావడంపై ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే పుష్ప ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పి నయా రికార్డు క్రియేట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *