జనవరి 1వ తేదిన కొత్త సంవత్సరం వచ్చిందని, సంక్రాంతి పండక్కి ఊరెళ్లి కుటుంబ సభ్యులతో చక్కగా ఎంజాయ్ చేసి కొత్త సినిమాలు చూడచ్చు అనుకునేవారికి బిగ్ షాక్ తగలబోతోందా అంటే నిజమే అనిపిస్తోంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం వరకూ ఓకే కానీ, కొత్త సినిమా చూడటానికి మాత్రం వీలు ఉండకపోవచ్చని అంటున్నారు సినీ ప్రేమికులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. దేశంలో కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వాయిదా వేసే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్లు సమాచారం. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ సినిమా జనవరి 7వ తేదిన రిలీజ్ కాబోతోందని గ్రాండ్ గా ఈవెంట్స్ కూడా నిర్వహించారు. అయితే, ఇప్పుడు వాయిదా వేస్తే మరోసారి ఈవెంట్స్ చేయాలన్నా, లేదా సినిమా గురించి ప్రమోట్ చేయాలన్నీ ఇంతకన్నా బాగా చేయలేరు. ప్రస్తుతం కరోనా వేవ్ తో ఓమిక్రాన్ కేసులు కూడా భయపెడుతుంటడం వల్ల ఈ నిర్ణయానికి వస్తున్నారా అనే వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ, మరోవైపు మాత్రం ఈ సినిమాలు వాయిదా వేస్తే చాలా మార్కెట్ నష్టపోతారని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాకపోతే దేశంలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పటికే దిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. ముంబయిలో సినిమాహాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరోవైపు ఏపీలోనూ టికెట్‌ ధరల వ్యవహారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వాయిదా వేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనక జరిగితే 100కోట్ల నుంచీ 300 కోట్ల వరకూ బిజినెస్ లాస్ అయిపోతుంది. ఈ ఊపులో సినిమాని రిలీజ్ చేస్తే కనీసం మ్యాగ్జిమమ్ మార్కెట్ ని గ్రాబ్ చేసి 1000 కోట్లుకి పైగా కలక్షన్స్ రాబట్టచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇలాంటి సందిగ్ధావస్ధలో సినిమాని రిలీజ్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రభాస్ హీరోగా రాబోతున్న రాధేశ్యామ్ సినిమాకి కూడా సేమ్ కష్టాలు ఎదురయ్యాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మరోసారి పరిశీలించబోతున్నారు. వాయిదాల పర్వం కొనసాగుతోన్న తరుణంలో సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ కోసం వెయిటింగ్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ , పూజాహెగ్ధేల లవ్ స్టోరీ బాలీవుడ్ కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని, 50శాతం అక్యూపెన్సీలో కూడా థియేటర్స్ కి జనం వస్తారని చెప్తున్నారు. అంతేకాదు, ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితేనే మరోసారి సినిమాకి ఆ వైభవం వస్తుందని , అందుకే సినిమాని వాయిదా వేయద్దని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *