అభిమానులు కలలో ఊహించని కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ ఈ సినిమాలో తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన క్రెడిట్ రాజమౌళికి దక్కింది. మెగా-నందమూరి హీరోలు కలిసి చేసిన ఈ మల్టీ స్టారర్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రవాలా, నా అల్లుడు’ సినిమాలను తీసిన గిరి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ ను తీయలేని ఆయన ప్లాన్ చేశారట.
చిరంజీవి-ఎన్టీఆర్ లను కలిపి మల్టీ స్టారర్ తీసేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసారట. భారతీయ యోధుడు రాణా ప్రతాప్ కథతో సినిమాని ప్లాన్ చేసినట్లు తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాని తీయలేని ప్లాన్ కూడా చేశారట. కానీ కొందరు చిరంజీవి-ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదని నిరాశను వ్యక్తం చేశారు. కానీ ఆ తరువాత విభేదాలు కావాలనే కొంతమంది క్రియేట్ చేసినవని ఎన్టీఆర్ తెలుసుకున్నారని గిరి తెలిపారు. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు తీసిన ఆయన ఆ సినిమాలు పరాజయం పాలవడంతో చిత్ర నిర్మాణానికి దూరం జరిగారు.
ఇదే ఇంటర్వ్యూలో తనకు ఎన్టీఆర్ కు కూడా విభేదాలు వచ్చినట్లు ఒప్పుకున్నారు. ఓ వ్యక్తి చేసిన పని వలన తమ మధ్య విభేదాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. నిర్మాత, ప్రస్తుత ఏపీ మంత్రి కొడాలి నాని పరిచయం చేసిన వ్యక్తి వల్లే తమ మధ్య విభేదాలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత వాస్తవం తెలియగానే ఎన్టీఆర్, నానితో కలిసి నేను ఆ వ్యక్తిని కొట్టామని చెప్పుకొచ్చారు. నిర్మాత గిరి చెప్పిన ఈ విషయాలపై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. ప్రస్తుతం మెగా ఫామిలీతో ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్- చిరంజీవి కాంబోలో మల్టీ స్టారర్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.