ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా శుక్రవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 365 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. తొలిరోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘పుష్ప’ దానిని తట్టుకుని నిలబడి ఈ రేంజ్ కలెక్షన్స్ వసూల్ చేయడం విశేషమని చెప్పాలి.

Nizam: 40.74Cr
Ceeded: 15.17Cr
UA: 8.13Cr
East: 4.89Cr
West: 3.95Cr
Guntur: 5.13Cr
Krishna: 4.26Cr
Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
Karnataka: 11.78Cr
Tamilnadu: 13.63Cr
Kerala: 5.60Cr
Hindi: 47.73Cr
ROI: 2.25Cr
OS – 14.56Cr
Total WW: 181.00CR(350.20CR~ Gross)

ఈ సినిమాను 146 కోట్ల రేటు కి అమ్మగా 50 తర్వాత సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. హిందీలోను అత్యధిక వసూళ్లను రాబట్టిన ఈ సినిమా అక్కడ కూడా రికార్డులు కలెక్ట్ చేసింది

WEEK 1:- 26.89CR
WEEK 2:- 20.20CR
WEEK 3:- 25.40CR
WEEK 4:- 11.79CR
WEEK 5:- 7.30CR
WEEK 6:- 6.25CR
WEEK 7:- 4.05CR
Total – 101.88CR(128Cr Gross – 47.73CR Share) హిందీలో 101 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక ఓవర్సీస్ నుంచి కూడా బాగానే వసూలు చేసింది. కథ కథనాలతో పాటు సుకుమార్ దర్శకత్వ ప్రతిభ బన్నీ నటనకు దేవి శ్రీ ప్రసాద్ పాటలు తోడు కావడంతో ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడానికి కారణమని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు సెకండ్ పార్టు షూటింగుకు ముస్తాబవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *