టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలు నేడు జరిగాయి. లాంచింగ్ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ చేతుల మీదుగా సినిమాను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆమె క్లాప్ కొట్టారు. మహేశ్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. మహర్షి తర్వాత ఆమె మరోసారి మహేశ్ కు హీరోయిన్ గా కనిపించనుంది. సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలు కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
తమన్ బాణీలు సమకూర్చనున్న ఈ సినిమా ఓపెనింగ్ కు మహేష్ బాబు హాజరు కాలేదు. సెంటిమెంట్ ప్రకారం తన సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కు మహేష్ ఎప్పుడు రాడనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్టోరీ టెల్లింగ్ కు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఎంటర్టైమెంట్ విషయంలో తగ్గదేలా అంటూ చెప్పే కథను పరిగెత్తించడం ఆయన స్టైల్. అందుకే ఏరి కోరి మరి మహేష్ తన 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది కావడం విశేషం. అతడు, ఖలేజా లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ రెండు చిత్రాలలో మ్యానరిజమ్స్, నటన విషయంలో మహేశ్ బాబు అందరి మన్ననలనూ పొందాడు. ఇక, ఈ సినిమాలో మహేశ్ ను త్రివిక్రమ్ ఇంకెంత కొత్తగా చూపిస్తాడో తెలియాలంటే వేచి చూడాలి.షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమా పూర్తి కాగానే ఎటువంటి గ్యాప్ లేకుండా మహేష్ దర్శకదీరుడు రాజమౌళి ప్రాజెక్టులో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి నెలలో ఆ షెడ్యూల్ ను మహేష్ పూర్తి చేయనున్నాడు. పరుశురామ్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 12న విడుదల చేస్తున్నారు.