సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా 335 కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బన్నీ వన్ మాన్ షోతో ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు. పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం రెండవ పార్ట్ కోసం సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. మొదటి పార్ట్ లాగే రెండవ పార్ట్ లోనూ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు ఉండేలా సుకుమార్ స్కిప్ట్ ని ఫైనల్ చేసినట్లు తెలిసింది.

తమని ఎగతాళి చేస్తున్న అన్నలను రెండవ పార్ట్ లో బన్నీ దారిలో పెడతాడట. సర్వం కోల్పయి రోడ్డు మీద పడిన వారందరికీ తోడుగా నిలిచే సన్నివేశాలు రెండవ పార్ట్ లో హైలైట్ కానున్నాయని తెలిసింది. పుష్ప ఆధిపత్యాన్ని అడ్డుకునే పోలీస్ ఆఫీసర్ గా ఫహద్ ఫాజిల్ విశ్వరూపాన్ని సుకుమార్ చూపించనున్నారని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా కేశవ పాత్ర పుష్ప పాత్రకు వెన్నుపోటు పొడుస్తాడనే వార్తలు వినబడుతున్నాయి. మనకందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కేశవ పాత్రను ఉపయోగించుకొని ఎస్పీ షెకావత్ బన్నీని దెబ్బకొట్టాలని చూస్తాడట. కానీ అందుకు ఒప్పుకోని కేశవ పాత్ర చనిపోవడం ప్రేక్షకులను చాలా ఎమోషనల్ గా ఉండేలా సుకుమార్ డిజైన్ చేసినట్లు తెలిసింది. క్లైమాక్స్ సన్నివేశాలలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఒకటి మనలని థ్రిల్ చేయడం గ్యారంటీ అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ని ముందుగా ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ను మార్చి నెల నుంచి స్టార్ట్ చేయనున్నారని సమాచారం. శరవేగంగా సినిమాని సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్ట్-1 లాగా హడావిడి లేకుండా ఈ సినిమాని డిసెంబర్ 17 2022న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట. పార్ట్-1 డిసెంబర్ 17 2021 వచ్చి సూపర్ హిట్ అయినట్లే రెండవ పార్ట్ కూడా డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ కావడం ఖాయమంటూ బన్నీ అభిమానులు ఫిక్స్ అయ్యారు. పుష్ప-2 అంచనాలు మించి ఉంటుందని సుకుమార్ ఇప్పటికే ప్రకటించడంతో సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ మొదలు కాగానే రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగకతప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *