బిగ్‌స్క్రీన్‌పై నటించాలని, బుల్లితెర షోల్లో ఓ వెలుగు వెలగాలని, ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై తామేంటో నిరూపించుకోవాలని చాలా మంది తపన పడుతారు. అయితే, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో, ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో తెలియడం కాస్త కష్టమే. ఇలాంటి వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సరైన ప్లాట్ ఫామ్ ను అందించేందుకు ‘hystar’ యాప్ వచ్చేసింది. 24 క్రాఫ్టులకు సంబంధించిన వ్యక్తులను ఒకేచోట కలిపేందుకు ‘HYSTAR’ అనే యాప్ గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది. హైస్టార్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ కూడా రిజిస్టర్ అవ్వొచ్చు.
ఆర్టిస్టులు, మోడల్స్, యాంకర్‌లు, సింగర్స్.. ఇలా 24 శాఖలకు సంబంధించి టాలెంట్ ఉన్న కొత్తవారూ, ఇప్పటికే ఈ ఫీల్డ్‌లో ఉన్న వారు హైస్టార్‌లో తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే మూవీ మేకర్స్ నుంచి అవకాశాలు పొందవచ్చు. “హైస్టార్”లో మెంబర్‌షిప్ కోసం రిజిస్టర్ అయ్యేందుకు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు మూవీ మేకర్‌లు కూడా ఈ యాప్‌లో తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో డైరెక్టర్‌లు తమ పాత్రలకు తగిన వారిని ఈ యాప్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉండే ఆర్టిస్టుల ప్రొఫైల్‌ను బట్టి, తమ సినిమా పాత్రలకు తగినవారిని డైరెక్టర్‌లు సెలక్ట్ చేసుకుని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
మూవీ మేకర్‌లకు ఆడిషన్స్ ఫ్లాట్‌ఫాంగానూ ఈ యాప్ ఉపయోగపడుతుందని hystar app నిర్వహకులు తెలిపారు. టాలెంట్ ఉన్నవారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఫ్లాట్‌ఫాంగా వచ్చిన హైస్టార్ యాప్‌లో ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల వాళ్లు ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఆడిషన్స్ అప్‌డేట్ కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. సో.. సినీ ఇండస్ట్రీలోకి, టీవీ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి, ఇప్పటికే సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు అందించే వేదికగా “హైస్టార్” యాప్ ఉపయోగపడనుంది.
