నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ గత ఏడాదిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పునర్జన్మల నేపథ్యంలో భారత దేశంలోని దేవదాసి దురాచారంపై పోరాడే కథానాయకుడి పాత్రతో నాని మెప్పించాడు. అలాగే, దేవదాసిగా సాయి పల్లవి నటన కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్ ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. యువ దర్శకుడు రాహుల్ సాంక్రిత్యాన్ చాలా కష్టమైన సబ్జెక్టును చాలా ఈజీగా డీల్ చేశాడు. దాంతో ఈ సినిమా థియేటర్లలలో కూడా బాగానే వసూల్ చేసింది.

మిక్కీ జే మేయర్ అందించిన స్వరాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్లస్ అయింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన ‘శ్యామ్ సింగరాయ్’ హయ్యెస్ట్ రేటింగ్ సాధించింది. అలాగే, పది వారాల పాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇన్ని విశేషాలు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. నాచురల్ స్టార్ నాని అభిమానులకు శుభవార్త. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆస్కార్ నామినేషన్ల రేసులో ఈ చిత్రం నిలిచింది.

నాని ద్విపాత్రాభినయం చేసిన చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూడు విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీరియాడిక్ డ్రామా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం మూడు విభాగాలలో తప్పకుండా నామినేట్ అవుతుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, సినీ అభిమానులకు ముఖ్యంగా నాని అభిమానులలో ఈ వార్త జోష్ నింపింది. నామినేట్ అయినా చాలు ఈ చిత్రం టాలీవుడ్ లో నయా రికార్డు నెలకొల్పనుంది. ఆస్కార్ అవార్డులలో శ్యామ్ సింగరాయ్ నామినేట్ అయ్యిందా? లేదా? అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగకతప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *