స్టైలిష్ స్టార్ నుంచీ ఐకాన్ స్టార్ గా ఎదిగిన బన్నీ తన ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ ఆలోచిస్తునే ఉంటాడు. అంతేకాదు, తనతో పాటుగా కెరియర్ ప్రారంభించిన వాళ్లు ఎక్కడైనా వెనకబడిపోతే వారిని ప్రోత్సహిస్తుంటాడు కూడా. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన అల్లుఅర్జున్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు, జస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు కోట్లు కుమ్మరిస్తాం అంటూ ఎన్నో యాడ్ కంపెనీలు బన్నీ వెంట పడుతున్నాయి. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని చాలా కమర్షియల్ బ్రాండ్స్ అన్నీ అల్లు అర్జున్ ని తమ బ్రాండ్ కి అంబాసిటర్ చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కమర్షియల్స్ లో నటించిన బన్నీ తాజాగా ఒక పెద్ద ఆఫర్ కి నో చెప్పాడట. పుష్ప 2 వల్ల బిజీగా ఉన్న బన్నీ కొన్ని కమర్షియల్ యాడ్స్ లో మాత్రమే నటిస్తున్నాడు. ఇందులో రాపిడో నుంచీ ఫ్రూటీ యాడ్ వరకూ అన్నీ మనం చూసినవే. ఇంకా కొన్ని యాడ్స్ లో కూడా బన్నీ నటిస్తున్నాడు. రీసంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్ లు కూడా వీటిని డైరెక్ట్ చేశారు. డిజిటల్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న బన్నీకి యాప్స్ కి సంబంధిచిన యాడ్స్ లో బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఫుడ్ డెలివరీ యాడ్, ట్రావెలింగ్, స్కూటర్ ఇలా ఎన్నో యాడ్స్ యాక్ట్ చేశాడు. అయితే, రీసంట్ గా ఒక పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నీకి భారీగా ఆఫర్ ఇస్తే రిజక్ట్ చేశాడట బన్నీ. కారణం ఏంటా అని ఆరాతీస్తే కేవలం ఫ్యాన్స్ కోసమే అని తెలుస్తోంది.
ఒక పొగాకు కంపెనీ తమ యాడ్ షూట్ కోసం ఒక రోజులో జస్ట్ రెండు గంటలు కెమెరా ముందుకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతే చాలని, దానికోసం దాదాపుగా 10కోట్ల వరకూ బన్నీకి ఆఫర్ చేశారట. అయినా కూడా బన్నీ ఆయాడ్ కి నో చెప్పాడట. అంతేకాదు, అలాంటి యాడ్స్ అసలు చేయను అని, అభిమానులు అవి చూసి వాటికి అలవాటు పడతారని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ యాడ్ కోసం 5కోట్ల నుంచీ 7.5 కోట్ల వరకూ రెమ్యూనిరేషన్ తీస్కుంటున్నాడు. ఇక పుష్ప 2 తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం బన్నీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. మరి వాటిలో బన్నీ దేనికి ఓకే చెప్తాడు. ఏ డైరెక్టర్ తో కమిట్ అవుతాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *