హీరో కార్తీకి తమిళంతో బాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండే సంగతి తెలిసిందే. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘ఖైదీ’ ఒకటి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ తమిళ తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హీరో కార్తి కెరీర్ లో కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. హీరోయిన్ లేకుండా కేవలం ఒక రాత్రి జరిగే కథతో ప్రమోగాత్మకంగా రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ప్రకటించి మూడు సంవత్సరాలైనా ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

ఇంత వరకు ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సీక్వెల్ ఉంటుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన ‘విక్రమ్’ సినిమాతో కార్తి ‘ఖైదీ’ సీక్వెల్ వుందని తేలిపోయింది. దీంతో సీక్వెల్ పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరుమన్’ ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో, కార్తీ సోదరుడు సూర్య తన భార్య జ్యోతికతో కలిసి నిర్మిస్తుండటం విశేషం. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో కార్తీ బిజీ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కార్తీకి ఖైదీ’ సీక్వెల్ కు సంబందించిన ప్రశ్న ఎదురయింది.

ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్, విజయ్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడనీ, ఆ తరువాత ‘ఖైదీ’ సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. అయితే ‘విక్రమ్’కు దీనికి ఎలాంటి సంబందంవుంటుందనే విషయాల్ని మాత్రం చెప్పేందుకు కార్తీ ఇష్టపడలేదు. కమల్ నటించిన విక్రమ్ సినిమాలో ‘ఖైదీ’ సీన్ కనిపిస్తుంది. బిజోయ్ పాత్ర ఢీల్లీతో కలిసి లారీలో వెళుతున్న సన్నివేశాలని చూపించారు. దాంతో సెకండ్ పార్ట్ లో కార్తీ, కమల్ హాసన్ ను కలిసి రోలెక్స్ అక్రమాలకు ఎలా చెక్ పెడతారనే సన్నివేశాలు ఉండనున్నాయని మనకు అర్ధమవుతోంది. మాస్టర్ సినిమాతో విజయ్ కి హిట్ ఇచ్చిన లోకేశ్, చాలా తక్కువ గ్యాప్ లో ఆయనతో మరో సినిమా చేస్తుండటం విశేషం. ఈ సినిమా పూర్తయిన తరువాత ‘ఖైదీ’ సీక్వెల్ చేసి, ఆ తరువాత ‘విక్రమ్’ సీక్వెల్ చేస్తాడని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *